Politics

పురంధేశ్వరికి విజయసాయిరెడ్డి చురకలు

పురంధేశ్వరి పై విజయసాయిరెడ్డి చురకలు

పురంధేశ్వరి ఓ టీడీపీ ఏజెంట్‌ అంటూ చురకలు అంటించారు విజయ సాయిరెడ్డి. బావ పార్టీ ఎక్కువైపోయిందా అమ్మా పురంధేశ్వరి? అంటూ విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్‌ పెట్టారు. ప్రత్యేక హోదా ఇవ్వమన్నా, వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆపమన్నా…అవి విధానపరమైన నిర్ణయాలంటూ తప్పించుకుంటావ్ కదా చెల్లమ్మా అని ఆగ్రహించారు సాయిరెడ్డి.ఫక్తు టీడీపీ ఏజెంట్‌లా మారిపోయి, మీ పార్టీకన్నా సామాజికవర్గం, బావగారి పార్టీ ఎక్కువైపోయిందా అమ్మా పురంధేశ్వరి? కేంద్రానికి టీడీపీ ఎందుకు మద్దతిస్తున్నదో అడిగావా అమ్మా? అని ఆగ్రహించారు. ఆ ఎర్ర డైరీల సైజు పెంచండయ్యా తెలుగు తమ్ముళ్లు! మీ మాట ఎవరూ వినకపోయినా, నిబంధనల ప్రకారం అధికారులు నడుచుకున్నా…వాళ్ల పేర్లను రాసుకుంటామని బెదిరిస్తున్నారు కదా! అని టీడీపీని ఉద్దేశించి చురకలు అంటించారు. కిందటిసారి చిత్తుగా ఓడించిన ప్రజలు 2024 ఎలక్షన్లలో కూడా అదే తీర్పును ఇవ్వబోతున్నారు. కోట్లలో ఉన్న వారి పేర్లను రాసుకోవాలికదా! అని సెటైర్లు పేల్చారు.