నైరుతి రుతుపవనాలు బలహీన పడి, దిగువస్థాయి నుంచి వీ స్తున్న గాలులతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్ర వెల్లడించింది. ఈ నెల 17, 18 వరకు ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతుందని పేర్కొన్నది. సాధారణంగా నైరుతి రుతుపవనాల సీజన్‌లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయని, రుతుపవనాల్లో కదలిక పెరిగి, 18 తర్వాత వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ నాగరత్న తెలిపారు.నైరుతి రుతుపవనాలు ప్రారంభమైన తర్వాత గడిచిన 4 రోజులుగా ఉష్ణోగ్రతలు రాష్ట్రవ్యాప్తంగా 30 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో శుక్రవారం 32.8 డిగ్రీలు, కనిష్ఠంగా 24.9 డిగ్రీలుగా నమోదైనట్టు పేర్కొన్నారు. ఈ నెల 20 వరకు ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయని వెల్లడించారు. రాబోయే వారం రోజుల పాటు రాష్ట్రంలోని పలుచోట్ల అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వివరించారు.