‘మోదీ’ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి విధించిన రెండేళ్ల జైలుశిక్ష నిలుపుదలకు నిరాకరించిన గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హేమంత్ ఎం.ప్రచ్ఛక్ బదిలీ కానున్నారు. బదిలీల నిమిత్తం సుప్రీంకోర్టు కొలీజియం తాజాగా 23 మంది హైకోర్టు జడ్జీల పేర్లతో ప్రతిపాదించిన జాబితాలో ఆయన కూడా ఉన్నారు. ఈ వివరాలను సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.