Politics

ముగిసిన పార్లమెంటు సమావేశాలు

ముగిసిన పార్లమెంటు సమావేశాలు

పార్లమెంటు సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. మఱిపూర్ అంశం ప్రధానంగా విపక్షాలు ఈ సమావేశాల్లో నిరసనలు చేసిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మణిపూర్ హింసపై పార్లమెంటులో మాట్లాడించాలని పట్టుబట్టిన ప్రతిపక్షాలు చివరకు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం చేసే వరకు వెళ్లాయి. ఎంపీల సస్పెన్షన్‌లతో ఈ సమావేశాలు ముగిశాయి.జులై 20వ తేదీన మొదలన ఈ సమావేశాలు 17 రోజులపాటు సాగాయి. శుక్రవారం పార్లమెంటు ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. లోక్ సభను వాయిదా వేయడంపై స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. దిగువ సభ 44 గంటలపాటు సాగిందని ఆయన వివరించారు. ఈ కాలంలో 20 బిల్లులు, 22 తీర్మానాలకు ఆమోదం లభించిందని తెలిపారు.

ఈ సారి పార్లమెంటు సమావేశాల్లో తొలిసారిగా కాంగ్రెస్ లోక్ సభా పక్ష నేతను సస్పెండ్ చేశారు. ఈ పరిణామాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇండియా కూటమి సభ్యులు శుక్రవారం వాకౌట్ చేసి అంబేద్కర్ విగ్రహం వద్దకు ర్యాలీగా వెళ్లారు. శుక్రవారం రోజున ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాను కూడా సస్పెండ్ చేయడం గమనార్హం.