గుర్తింపును దాచి ఓ మహిళను పెండ్లి చేసుకోవడం నేరం కిందకు వస్తుందని తాజా భారతీయ న్యాయ సంహిత(BNS) బిల్లు పేర్కొన్నది. అదేవిధంగా పెండ్లి, ప్రమోషన్, ఉద్యోగం పేరుతో మహిళలను లైంగికంగా లొంగదీసుకోవడం తీవ్రమైననేరంగా పేర్కొంటూ నిబంధనలు రూపొందించారు. నిందితుడికి 10 ఏండ్ల వరకు జైలుశిక్ష, జరిమానా విధించే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ఐపీసీలోని సెక్షన్ 377, వ్యభిచార సంబంధిత నిబంధనలన కూడా కొత్త బిల్లులో ఉపసంహరించారు. సెక్షన్ 377 కింద ఉండే ‘అసహజ సెక్స్’ నిబంధనలను తొలగించారు. ప్రస్తుత నిబంధన ప్రకారం.. ఎవరైనా ప్రకృతికి విరుద్ధంగా పురుషుడు, స్త్రీ లేదా జంతువుతో అసహజ సెక్స్ పాల్పడితే 10 ఏండ్ల వరకు లేదా జీవిత ఖైదు శిక్ష కూడా పడుతుంది. భారతీయ సురక్ష సంహిత బిల్లులో తొమ్మిది నిబంధనల తొలగింపునకు ప్రతిపాదించారు. 160 నిబంధనల్లో మార్పులు చేయడంతోపాటు, కొత్తగా తొమ్మిది నిబంధనలు చేర్చారు. భారతీయ సాక్ష్య బిల్లులో(బీఎస్) ఐదు నిబంధనలు తొలగించారు. 23 నిబంధనలు మార్పులకు ప్రతిపాదనలు చేయగా, ఒక కొత్త నిబంధనను ప్రవేశపెట్టారు.
జంతువులతో అసహజ శృంగారం చేస్తే 10ఏళ్లు జైలుశిక్ష
Related tags :