Politics

భారస అభ్యర్థుల జాబితా సిద్ధం?

భారస అభ్యర్థుల జాబితా సిద్ధం?

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్‌ కొట్టే దిశగా భారత్‌ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కార్యాచరణను వేగవంతం చేశారు. పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై కసరత్తు పూర్తిచేసిన ఆయన.. ఈ నెల 17వ తేదీ తర్వాత ఏ క్షణమైనా లిస్టును ప్రకటించనున్నట్టు తెలిసింది. సీఎం పెద్ద సంఖ్యలో అభ్యర్థులతో జంబో జాబితా ప్రకటించనున్నారని.. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకుగాను ఈ తొలి జాబితాలోనే కనీసం 80–90 మంది అభ్యర్థుల పేర్లు ఉండే అవకాశముందని బీఆర్‌ఎస్‌లోని విశ్వసనీయ వర్గాల సమాచారం.