టిడిపి అధినేత చంద్రబాబు ఈనెల 15న విశాఖలో పర్యటించనున్నారు. స్వాతంత్ర దినోత్సవం రోజు సాయంత్రం విశాఖ ఆర్కే బీచ్ సమీపంలోని NTR విగ్రహం వద్ద నుంచి 2 కిలోమీటర్ల మేర జాతీయ జెండాతో సమైక్యత పాదయాత్ర నిర్వహిస్తారు. అనంతరం ఎంజీఎం పార్క్ ఆవరణలో యువత మేధావులతో జరిగే సమావేశంలో విజన్ డాక్యుమెంట్ 2047ను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత అంబేద్కర్ కోనసీమ జిల్లాకు వెళ్తారు.కాగా, విశాఖ రుషికొండపై నిర్మిస్తోంది సచివాలయమే అని వైసిపి ట్వీట్ ద్వారా తెలిసింది. రుషికొండ తవ్వకాలపై సీఎంను విమర్శిస్తూ టిడిపి ఓ వీడియో పోస్ట్ చేయగా… వైసిపి రిప్లై ఇచ్చింది. ‘ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసేందుకు విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించి రుషికొండపై సెక్రటేరియట్ నిర్మాణం చేపడుతున్నారు జగన్. దానిమీద దుష్ప్రచారం చూస్తుంటే మీకు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడం ఇష్టం లేదనిపిస్తోంది’ అని పేర్కొంది.