DailyDose

బీజేపీ సనాఖాన్‌ హత్య కేసులో ఆమె భర్త అరెస్ట్-TNI నేటి నేర వార్తలు

బీజేపీ సనాఖాన్‌ హత్య కేసులో ఆమె భర్త అరెస్ట్-TNI నేటి నేర వార్తలు

భార్య ఎక్కువగా ఫోన్ వాడుతుందన్న కోపంతో భర్త ఏం చేశాడంటే?

ప్రస్తుతం మనుషులతో మాట్లాడటం కంటే ఎక్కువగా సెల్‌ఫోన్‌లకే బానిసలు అవుతున్నారు. ఎక్కడ ఉన్నా సోషల్ మీడియాలోనే మునిగిపోతున్నారు. దీంతో కొంత మంది ప్రాణాలు కూడా కోల్పోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా ఓ పచ్చని కాపురంలో నిప్పులు పోసింది. భార్య ఎక్కువగా ఫోన్ వాడుతుందన్న కోపంతో భర్త ఉరివేసి చంపేసిన ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది.వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని మాండ్య జిల్లాలో శ్రీనాథ్, పూజలకు తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఓ కూతురు కూడా ఉంది. అయితే తన భార్య పూజ సోషల్ మీడియాలో చాలా సమయం ఉంటుందని భర్త శ్రీనాథ్‌కు కోపంగా ఉండేది. రీల్స్, షార్ట్ వీడియోలతోనే ఆమె కాలం గడిపేది. దీంతో వీరి మధ్య నిత్యం గొడవలు వచ్చేవి. అంతేకాకుండా ఆమెకు మరోకరితో వివాహేతర సంబంధం కూడా ఉందన్న అనుమానం కూడా శ్రీనాథ్‌కు ఉండేది. ఒకరోజు ఫోన్ వల్ల ఈ జంట మధ్య వాదనలు జరిగాయి. దీంతో కోపోద్రిక్తుడైన భర్త, భార్యను ఆమె చూన్నీతోనే ఉరి వేసి చంపేశాడు. ఆ తర్వాత శవాన్ని తీసుకెళ్లి నదిలో పడేశాడు. కొద్ది రోజుల తర్వాత శ్రీనాథ్ స్వయంగా వెళ్లి పోలీసులకు జరిగిందంతా విరించి లొంగిపోవడంతో ఈ విషయం బయటకు వచ్చింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

11 ఏళ్ల చిన్నారి గొంతునులిమి దారుణ హత్య

 పశ్చిమ ఢిల్లీలోని ఇందర్‌పురి ప్రాంతంలో దారుణం జరిగింది. 11 ఏళ్ల బాలుడిని ఓ మహిళ గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ బాలుడి నివాసంలోని బెడ్‌బాక్స్‌లో మృతదేహం లభ్యమైంది. బాలుడి మెడపై గొంతు నులిమి చంపిన గుర్తులు ఉన్నాయి. గురువారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో బీఎల్‌కే ఆస్పత్రి నుంచి వచ్చిన నోటిఫికేషన్‌ ప్రకారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు బాలుడి తల్లి వాంగ్మూలాన్ని నమోదు చేసి హత్య కేసు నమోదు చేశారు.గురువారం సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి బయటి నుంచి తాళం వేసి ఉండటాన్ని గుర్తించామని మృతురాలి తల్లి నీలు పోలీసులకు తెలిపారు. బాలుడు నడక కోసం బయటకు వెళ్లాడని ఆమె మొదట భావించింది. అయితే అతను క్లాస్‌కు రాకపోవడంపై అతని డ్యాన్స్ టీచర్ నుంచి వెంటనే కాల్ వచ్చింది. నీలు, ఆమె భర్త జితేంద్ర విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. విడివిడిగా నివసిస్తున్నారు. కొడుకు కనిపించకుండా పోయినప్పుడు నీలు జితేంద్రకు ఫోన్ చేసింది, అయితే ఒక మహిళ కాల్ ఆన్సర్ చేసింది. ఆ ఫోన్‌లో ఒకరికి అత్యంత ఇష్టమైన ఆస్తిని తీసివేయడం ఎలా అని ఆ మహిళ ప్రశ్నించిందని నీలు తెలిపింది. ఈ సంభాషణతో తాను ఉలిక్కిపడ్డానని ఆమె పోలీసులకు తెలిపింది. ఇంట్లో వెతకగా బెడ్‌బాక్స్‌లో బిడ్డ మృతదేహాన్ని దాచిపెట్టినట్లు నీలు చెప్పారు. తన పొరుగువారి సహాయంతో, ఆమె అపస్మారక స్థితిలో ఉన్న పిల్లవాడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించింది. అక్కడ ఆ బాలుడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.

ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో భార్యను హత్య చేసిన భర్త

ఓ వ్యక్తి   ఇన్ స్టాగ్రామ్  లైవ్ పెట్టి, తన మాజీ భార్యను దారుణంగా హత్య చేశాడు. ఆమెను హత్య చేసిన తర్వాత  మరో వ్యక్తిని, అతని కొడుకును కూడా కాల్చి చంపేశాడు.ఆ తర్వాత అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బోస్నియాలో చోటుచేసుకోగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.ఈశాన్య బోస్నియా పట్టణంలోని గ్రాడకాక్‌లో ఈ దాడి జరిగింది. ముగ్గురిని చంపేసి, ఆ తర్వాత అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడని, అక్కడి అధికారులు తెలిపారు  బోస్నియా ఇప్పటికీ మహిళలపై హింస విస్తృతంగా ఉంది, అయితే మాజీ భార్య ని హత్య చేస్తూ ప్రత్యక్ష ప్రసారం చేయడం అక్కడి ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది.ఆమెను చంపిన తర్వాత, ఆ వ్యక్తి పిస్టల్‌తో గ్రాడకాక్ వీధుల్లోకి వెళ్లి ఒక వ్యక్తిని, అతని కొడుకును కాల్చి చంపాడని న్యాయవాదులు తెలిపారు. అతను పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఒక పోలీసు అధికారిని, మరొక వ్యక్తి , ఒక మహిళను కూడా గాయపరిచాడని అక్కడి అధికారులు తెలిపారు.బోస్నియన్ ఫెడరేషన్ ప్రధాన మంత్రి నెర్మిన్ నిక్సిక్ మాట్లాడుతూ, “ఈ రోజు గ్రాడకాక్‌లో ఏమి జరిగిందో వివరించడానికి నా దగ్గర మాటలు లేవు. హంతకుడు చివరికి తన ప్రాణాలను తీసుకున్నాడు, కాని బాధితుల ప్రాణాలను ఎవరూ తిరిగి తీసుకురాలేరు.” అని చెప్పారు.కాల్పులకు గల కారణాలను అధికారులు వెంటనే అందించలేదు. అయితే, చనిపోయిన సదరు మహిళను అతను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి వేధిస్తూనే ఉన్నాడట. ఆ వేధింపులు తట్టుకోలేకే ఆమె అతని నుంచి దూరమైంది. అయితే, చాలా కాలం తర్వాత వచ్చి ఇలా హత్య చేయడం అందరినీ షాకింగ్ కి గురి చేసింది.

ఆస్తి కోసం మనవడిని హత్య చేసిన తాతయ్య 

పశ్చిమ గోదావరిలో విషాదం చోటు చేసుకుంది. ఆస్తి కోసం సొంత మనవడిని హత్య చేశాడు ఓ కసాయి తాతయ్య. కొడుకు, కోడలు విడాకులకు సిద్ధం కావడంతో తన ఆస్తి మనవడికి వెళ్తుందని భావించి దారుణానికి పాల్పడ్డాడు తాత పోకల నాగేశ్వరరావు. పెంటపాడు మండలం మీనావల్లూరులో ఆరేళ్ల బాలుడు పొకల వెంకట కళ్యాణ్ అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడుతోంది.కుటుంబ కలహాల నేపథ్యంలో తాతయ్య… బాలుడిని హత్య చేశాడని చెబుతున్నారు కుటుంబ సభ్యులు. ఇక ప్రస్తుతం తాతయ్య పోకల నాగేశ్వరరావు పరారిలో ఉన్నాడు. బాలుడి తల్లి శిరీష తండ్రి పోకల సత్తిబాబులకు 11ఏళ్ల క్రితం వివాహం జరుగగా.. వీరి మధ్య కొంత కాలంగా విభేదాలు వస్తున్నాయి. ఇక కొడుకు-కోడలు విడాకులు తీసుకుంటే తన ఆస్తి మొత్తం మనవడికి వెళ్ళిపోతుందనే అనుమానంతో బాలుడిని తాత పోకల నాగేశ్వర రావు హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే పోలీసుల అదుపులో బాలుడు తండ్రి సత్యనారాయణ, నాయనమ్మ లక్ష్మి ఉన్నారు. దీనిపై ఇంకా విచారణ కొనసాగుతోంది.

గుజరాత్ లో లారీని ఢీకొన్న ట్రక్కు

గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిలిపి ఉన్న లారీని ఓ మినీ ట్రక్కు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది దుర్మరణం చెందారు. ఇందులో ముగ్గురు పిల్లలు, ఐదుగురు మహిళలు ఉన్నారు. ఈ ఘటన అహ్మదాబాద్ జిల్లాలో శుక్రవారం జరిగింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ, ఆ రాష్ట్ర సీఎం భూపేంద్ర పాటిల్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం ప్రకటించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అహ్మదాబాద్ చోటిలా ప్రాంతానికి చెందిన  23 మంది ఓ మినీ ట్రక్కులో సురేంద్రనగర్ జిల్లాకు వెళ్లారు. తిరిగి అదే ట్రక్కులో స్వస్థలానికి ప్రయాణం మొదలుపెట్టారు. ఈ వాహనం రాజ్‌కోట్-అహ్మదాబాద్ హైవేపై ప్రయాణం సాగిస్తోంది. అయితే అంతకు ముందు ఆ రోడ్డు వెళ్తున్న ఓ లారీ పంక్చర్ అయ్యింది. దీంతో దానిని డ్రైవర్ రోడ్డు పక్కన నిలిపి ఉంచాడు.అయితే ఉదయం 11 గంటల సమయంలో ఈ మినీ ట్రక్కు వెళ్లి నిలిపి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో మొత్తంగా 10 మంది మరణించారు. ఇందులో ఐదుగురు మహిళలు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. దీనిపై సమాచారం అందగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించారు. కాగా, ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 

రోడ్డు తెగడంతో లోయలోకి జారిపోయిన బస్సు

హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలోని మండి జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయాన్నే సుందర్‌నగర్‌ యూనిట్‌ నుంచి ప్రయాణికులతో షిమ్లాకు బయలుదేరిన హిమాచల్‌ప్రదేశ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పోరేషన్‌ (HRTC) బస్సు.. మార్గమధ్యలో మండి జిల్లాలో రోడ్డు తెగిపోవడంతో లోయలోకి జారిపోయింది. ఈ ప్రమాదంలో 12 మందికి గాయాలయ్యాయి.కాగా, బస్సు లోయలో పడిందని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్స్‌ రక్షణ చర్యలు చేపట్టారు. ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. వారిలో 12 మందికి గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. హిమాచల్‌ప్రదేశ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పోరేషన్ (HRTC) ఈ వివరాలను మీడియాకు వెల్లడించింది.

 బీజేపీ సనాఖాన్‌ హత్య కేసులో ఆమె భర్త అరెస్ట్

 పది రోజులుగా కనిపించకుండాపోయిన నాగ్‌పుర్‌కు చెందిన భాజపా నేత సనాఖాన్ కేసులో పోలీసులు ఆమె భర్తను అరెస్టు చేశారు. సనాను ఆమె భర్తే హత్య చేశాడని వెల్లడించారు.మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు చెందిన సనాఖాన్‌.. భాజపా మైనార్టీ సెల్‌ సభ్యురాలు. ఆమె ఆగస్టు ఒకటిన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌(Jabalpur)కు వెళ్లారు. ఆ తర్వాత నుంచి ఆమె కనిపించలేదు. తన భర్తను కలిసేందుకు ఆమె అక్కడికి వెళ్లిందని కుటుంబసభ్యులు తెలిపారు. జబల్‌పుర్‌కు చేరుకున్న తర్వాత సనా తన తల్లికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. భర్త అమిత్‌ సాహును కలిసి రెండు రోజుల్లో తిరిగిరావాల్సి ఉందని వారు తెలిపారు. కానీ ఆమె ఫోన్‌ స్విచ్ఛాఫ్ అని రావడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారుఅమిత్‌ సాహు మద్యం అక్రమరవాణా వ్యాపారం చేస్తుంటాడని, ఓ దాబా నిర్వహిస్తున్నాడని సమాచారం. ఆర్థిక లావాదేవీల విషయంలో సనా, అమిత్‌ మధ్య కొద్దికాలంగా గొడవలు ఉన్నాయి. ఆమె జబల్‌పుర్ వచ్చిన సమయంలో కూడా అదే విషయమై వారిద్దరు గొడవపడ్డారని, అది కాస్తా తీవ్ర ఘర్షణకు దారితీయడంతో అమిత్‌ దాడి చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. తన ఇంట్లోనే ఆమెను కొట్టడంతో మరణించిందని, తర్వాత ఆమెను హిరాన్ నదిలో విసిరేశానని విచారణలో అమిత్ అంగీకరించాడు. ఆమె మృతదేహం కోసం గాలింపు చేపట్టామని పోలీసులు తెలిపారు. అలాగే ఈ కేసులో అమిత్‌తో పాటు మరో అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు.

* మహిళపై పెట్రోల్‌ పోసి చంపిన కేసులో బిగ్‌ ట్విస్ట్‌

శంషాబాద్‌ శ్రీనావాస్ ఎన‌క్లేవ్ లో జరిగిన మహిళ హత్య, దహనం కేసులో మిస్టరీ వీడింది. శంషాబాద్‌ శ్రీనావాస్ ఎన‌క్లేవ్ లో మహిళను హత్య చేసి తగలబెట్టిన కేసును ఛేదించారు పోలీసులు. శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాళ్ళగూడదొడ్డి ప్రాంతానికి చెందిన వడ్ల మంజులగా గుర్తించారు పోలీసులుతన భర్తతో కడుపునొప్పి లేస్తుందని భార్య లక్ష్మయ్యకు చెప్పి ఇంట్లోంచి బయటికి వచ్చింది మంజుల. అలా గత రెండు రోజుల క్రితం ఇంట్లోంచి బయటికి వచ్చింది మంజుల. ఇక నిన్న సాయంత్రం ముంజుల కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆమె భర్త లక్ష్మయ్య. ఇక మంజుల భర్త లక్ష్మయ్య ఫిర్యాదుతో మర్డర్ మిస్టరీ వీడింది. మంజుల కాలివేళ్ళకు ఉన్న మెట్టెలు ఆధారంగా కేసు ఛేదించిన పోలీసులు.. ఆమె ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

గుడివాడలో మహిళా వాలంటీర్ ఆత్మహత్య యత్నం

కృష్ణా జిల్లా గుడివాడలో ఓ మహిళా వాలంటీర్ ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. 26వ వార్డు వాలంటీరు ప్రత్తిపాటి చంద్రలీల కొంత కాలంగా భర్తకు దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో తన ఇద్దరు పిల్లలను పోషించుకోవడానికి గౌరవ వేతనం చాలక ఓ జిరాక్స్‌ దుకాణంలో పని చేసుకొని జీవిస్తోంది. అయితే చంద్రలీల విధులు సక్రమంగా  నిర్వహించడం లేదని మరో వాలంటీర్ ప్రచారం చేసినట్టుగా చెబుతున్నారు. అయితే శుక్రవారం చంద్రలీలను నాగేంద్ర తీవ్రపదజాలంతో దూషించినట్టుగా తెలుస్తోంది. నాగేంద్రకు మరికొందరు కూడా మద్దతుగా ఉన్నారని చెబుతున్నారు. అయితే ఈ క్రమంలోనే చంద్రలీల తీవ్ర మనస్థాపం చెంది ఆత్మహత్యకు యత్నించింది. అయితే స్థానికులు ఆమెను కాపాడి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చంద్రలీల గుడివాడ ఏరియా ఆస్పత్రిలో చికిత్సపొందుతుంది. తనను దూషించడంతో ఆత్మహత్యకు పాల్పడినట్టుగా  చంద్రలీల చెబుతుంది. అలాగే కొందరు అధికారుల నుంచి కూడా వేధింపులు ఎదుర్కొంటున్నట్టుగా చంద్రలీల పేర్కొంటున్నారు. 

అన్నపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తమ్ముడు

ఆస్తి విషయంలో అన్నదమ్ములకు గొడవ కావడంతో అన్న పై తమ్ముడు పెట్రోల్ పోసి నిప్పటించాడు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున కొల్చారం మండలం అప్పాజీపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన తిమ్మక్కపల్లి శంకరయ్యకు ముగ్గురు కుమారులు ప్రవీణ్ , ప్రశాంత్, అశోక్‌లు ఉన్నారు. ప్రశాంత్‌ను గ్రామంలోని చింతల రాములు ఇంటికి ఇల్లరికం పంపారు. ఇల్లరికం వెళ్లిన ప్రశాంత్ గత కొన్ని రోజులుగా ఆస్తి విషయంలో తన అన్న ప్రవీణ్, తమ్ముడు అశోక్‌లతో గొడవ పడుతున్నాడు.తనకు ఆస్తిలో వాటా కావాలని తరచూ గొడవలు జరుగుతున్నాయి. శంకరయ్య భార్య లక్ష్మి ముగ్గురు కుమారులు ఆస్తిలో వాటా పంచుకోవాలని తెలిపింది. వాటా ఇవ్వకపోతే అన్న ప్రవీణ్‌ను చంపుతానని చెప్పడంతో తల్లి మాటలు విని ప్రశాంత్ అందరూ నిద్రించిన తర్వాత పెట్రోల్ తీసుకువచ్చి ప్రవీణ్ పై పోసి తగలబెట్టాడు. దీంతో ప్రవీణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గ్రామస్తులు ప్రవీణ్ మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. 90% శాతం కాలినగాయాలతో ప్రవీణ్ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుని భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కొల్చారం ఎస్‌ఐ మహమ్మద్ గౌస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.