Politics

హ్యాట్రిక్ CM కేసీఆర్

హ్యాట్రిక్ CM కేసీఆర్

వచ్చే శాసనసభ ఎన్నికల్లోనూ భారత్‌ రాష్ట్ర సమితి ఘన విజయం సాధిస్తుందని, కేసీఆర్‌ వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. భారాసకు, కేసీఆర్‌కు రాష్ట్రంలో పోటీయే లేదని తెలిపారు. రాష్ట్రంలోని న్యాయవాదులకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. వారి సమస్యలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ భవన్‌లో శనివారం నిర్వహించిన భారాస రాష్ట్ర న్యాయవాద విభాగం సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.