Politics

రాహుల్ సెప్టెంబరులో విదేశీ పర్యటన

రాహుల్ సెప్టెంబరులో విదేశీ పర్యటన

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు రాహుల్ యూరప్‌లో పర్యటించబోతున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ బెల్జియం, నార్వే, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించబోతున్నారు. యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ సభ్యులతో బ్రసెల్స్‌లో సమావేశం, ఫ్రాన్స్, బెల్జియంలో ప్రవాస భారతీయూలతో భేటీ అవుతారని పార్టీ వర్గాలు తెలిపారు. ఈ ఏడాది రాహుల్ గాంధీకి ఇది మూడో విదేశీ పర్యటన కానుంది. చివరి సారిగా ఈ ఏడాది మేలో అమెరికాలో పర్యటించారు. అయితే విదేశీ పర్యటనల్లో రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా పర్యటనపై బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి.