స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సమయం ఆసన్నమైంది. దేశవ్యాప్తంగా వేడుకలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. దేశ రాజధానిలో నేడు సైనిక దళాల డ్రస్ రిహార్సల్స్ జరుగుతున్నాయి. ఈ మేరకు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు అధికారులు. స్వాతంత్య్ర వేడుకలకు దేశ రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆగష్టు 15న జరగనున్న వేడుకలకు వివిధ సైనిక దళాలు నేడు ఎర్రకోట వద్ద డ్రెస్ రిహార్సల్స్ చేస్తున్నాయి. 77 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని మోదీ ఇక్కడ నుంచే ఉపన్యాసం ఇవ్వనున్నారు. డ్రెస్ రిహార్సల్‌కు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.
Independence Day: ఢిల్లీలో దళాల రిహార్సల్
Related tags :