తెలుగు దంగల్. యస్. తెలుగులో రాజకీయం రచ్చ రేపింది. అక్కడా ఇక్కడా కాదు. ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలో. అందులోనూ పార్లమెంటు సాక్షిగా తెలుగు మాటలు.. మంటలు పుట్టించాయి. మొదట రేవంత్‌రెడ్డి బిగిన్ చేస్తే.. తర్వాత బండి సంజయ్ అందుకున్నారు. అచ్చ తెలుగులో రాజకీయం మాట్లాడితే ఎట్టా ఉంటాదో ఢిల్లీకి రుచి చూపించారు. రేవంత్ వర్సెస్ బండి.. తెలుగులో పేలిన డైనమైట్ల లాంటి డైలాగులకు పార్లమెంట్ దద్దరిల్లింది.
గల్లీలో కాదు దేశ రాజధాని ఢిల్లీలో కూడా తెలంగాణ రాజకీయం మార్మోగింది. అది కూడా అచ్చ తెలుగులో పార్లమెంటులో ప్రతిధ్వనించింది. లోక్‌సభలో టీ కాంగ్రెస్ చీఫ్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి.. తమ పొలిటికల్ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. లిక్కర్ పార్టీ, నిక్కర్ పార్టీ అంటూ బీఆర్‌ఎస్, బీజేపీలపై దాడి చేశారు. అది కూడా తెలుగులో. ఇక బండి సంజయ్ కూడా సేమ్ టు సేమ్. రేవంత్‌కు, కాంగ్రెస్‌కు గురి పెట్టి మరీ.. తెలుగులో మాటల తూటాలు పేల్చారు. ఇద్దరు తెలంగాణ నేతలు తెలుగులో మాటకు మాట అంటూ పార్లమెంటులో రాజకీయ మంటలు రేపారు. లోక్‌సభ సాక్షిగా తెలంగాణ తీన్‌మార్ రాజకీయం తెలుగులో దుమ్ము రేపింది.ఇక ఆ తర్వాత నేనున్నా అంటూ రంగంలోకి దిగారు కరీంనగర్ ఎంపీ, బీజేపీ ఫైర్ బ్రాండ్ బండి సంజయ్. రేవంత్‌కు కౌంటర్ ఇచ్చారు. బీజేపీ లిక్కర్ పార్టీ కాదని.. కాంగ్రెస్సే లిక్కర్ పార్టీ అంటూ ఏకి పడేశారు. నిక్కర్లు అంటూ ఎగతాళి చేయడం కాదు.. ఆర్‌ఎస్‌ఎస్ వాళ్లకు దేశభక్తి ఉంటుందని రేవంత్ గ్రహించాలన్నారు. తెలంగాణ రాజకీయం.. అచ్చ తెలుగులో తీన్‌మార్ స్టైల్లో పార్లమెంటులో రచ్చ రేపింది.