Business

వాణిజ్య పన్నుల శాఖలో 170 కోట్ల కుంభకోణం

వాణిజ్య పన్నుల శాఖలో 170 కోట్ల కుంభకోణం

జీఎస్టీ (GST) వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాల్సిన వాణిజ్య పన్నుల (Commercial Tax) శాఖ అధికారులే అక్రమాలకు తెరతీశారు. అయినవారికి తక్కువ పన్నులు, జరిమానాలతో సరిపెట్టి రూ.170 కోట్ల మేర కుంభకోణానికి పాల్పడ్డారు. ఈ వ్యవహారంపై నెలకిందటే విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అయినా అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం ఉదాసీనత ప్రదర్శిస్తోంది. ఓ మంత్రి జోక్యంతోనే చర్యలకు మీనమేషాలు లెక్కిస్తున్నారని వాణిజ్య పన్నుల శాఖ వర్గాలే చెబుతున్నాయి.