‘‘కెరీర్ ఆరంభంలో నేనేమీ గొప్ప నటిని కాదు. 1986లో నేను నటించిన తమిళ చిత్రం ‘మొదల్ వసంతం’. ఆ సినిమా చూశాక.. ‘నువ్వు ఇంతకాలం నటిగా ఎలా కొనసాగావు’ అని మా అమ్మ అడిగారు. ఆ సినిమాలోని నా పాత్రకు ఏమాత్రం గుర్తింపు రాలేదు. వాసుదేవన్, సత్యరాజ్ వంటి గొప్ప నటులు ఆ సినిమాలో ఉన్నప్పటికీ అది నాకు ఏమాత్రం ఉపయోగపడలేదు. అలాగే, నేను నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని అందుకున్నాయి. దాంతో నేను తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టా. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించుకున్నా’’ అని రమ్యకృష్ణ చెప్పారు.
ఆ పరాజయలే నేను తెలుగులోకి రావడానికి కారణం
Related tags :