NRI-NRT

భారతీయ విద్యార్థులకు అందుబాటులో అమెరికా వీసా స్లాట్లు

భారతీయ విద్యార్థులకు అందుబాటులో అమెరికా వీసా స్లాట్లు

ఉన్నత విద్యకోసం వెళ్లాలనుకునే ఆశావహులకు అమెరికా తీపికబురు చెప్పింది. వీసాలకు సంబంధించి ఇంటర్వ్యూలో తిరస్కరణకు గురైన వారికి మరో అవకాశం కల్పించింది. ఈ ఏడాది ఆగస్టు చివరి వారం నుంచి సెప్టెంబరు రెండో వారం వరకు ఫాల్‌ సీజనుకు సంబంధించి విద్యాసంస్థలు తరగతులను ప్రారంభించనున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా తాజాగా తీసుకున్న నిర్ణయం ఉన్నత విద్యకోసం అక్కడికి వెళ్లాలనుకునే విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆనందానికి లోనుచేస్తోంది. ఇప్పటివరకు వీసా స్లాట్లు లభించని వారికి కూడా స్లాట్లను వేర్వేరుగా విడుదల చేసింది. దిల్లీ రాయబార కార్యాలయంతోపాటు ముంబయి, చెన్నై, కోల్‌కతాలలోని కాన్సులేట్ల పరిధిలో ఈ స్లాట్లు విడుదల చేశారు. హైదరాబాద్‌ కాన్సులేట్‌ పరిధిలో మాత్రమే స్లాట్లు విడుదలవకపోవడం చర్చనీయాంశమైంది. ప్రస్తుత ఫాల్‌ సీజన్‌లో భారతీయ విద్యార్థులకు పెద్దసంఖ్యలో వీసాలు జారీ చేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఇప్పటికే భారీగా వీసాలు జారీ చేసింది.