యూకే వీసా పొందడటం ఇప్పుడు మరింత సులభంగా మారింది. ఇకపై బెంగళూరు, మంగళూరు, విశాఖపట్నంలోని తాజ్ హోటళల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా హోటళల్లోని ఏర్పాటైన వీసా ఔట్‌సోర్సింగ్ సేవల సంస్థ వీఎఫ్ఎస్ గ్లోబల్(VFS Global) కేంద్రాల్లో వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు వీఎఫ్ఎస్ గ్లోబల్ సంస్థ టాటాలకు చెందిన ఇండియన్ హోటల్స్ కంపెనీ(Indian Hotels company), రాడిస్ హోటల్స్ గ్రూప్‌తో(Radisson Hotels Group) ఒప్పందం కుదుర్చుకుంది. బెంగళూరు, మంగళూరులోని వివాంతా, విశాఖపట్నంలోని ది గేట్వే హోటల్‌లో ఈ సదుపాయం ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు వీఎఫ్ఎస్ గ్లోబల్ సోషల్ మీడియాలో పేర్కొంది. దీంతో పాటూ నోయిడా, లూథియానా, అమృతసర్, మోహాలీలోని సంబంధిత హోటళ్లలో కూడా వీసా దరఖాస్తు, బయోమెట్రిక్ వివరాలను నమోదు చేసుకోవచ్చు.భారతీయ పర్యాటకులు, వృత్తినిపుణులు, విద్యార్థులతో యూకేకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే బ్రిటన్ వీసాల్లో అధిగభాగం భారతీయ పర్యాటకులు పొందుతారు. బ్రిటన్‌లోని భారతీయ పర్యాటకులు రెండు దేశాల మధ్య వారధిగా నిలుస్తున్నారు. అందుకే, బ్రిటన్‌కు చెందిన వీసా దరఖాస్తు కేంద్రాల అతిపెద్ద నెట్వర్క్ భారత్‌లో ఉంది.
వీఎఫ్ఎస్ గ్లోబల్, రాడిస్ హోటళ్ల మధ్య కుదిరిన ఒప్పందంతో ఈ నెట్వర్క్ మరింత విస్తరించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది’’ అని భారత్‌లో యాక్టింగ్ బ్రిటిష్ హైకమిషనర్ క్రిస్టీనా స్కాట్ పేర్కొన్నారు. అయితే, ఆయా హోటళ్లల్లో వీసా దరఖాస్తులు సమర్పించేందుకు అభ్యర్థులు ముందస్తుగా అపాయింట్‌మెంట్ తీసుకోవడం తప్పనిసరి. ఆన్‌లైన్‌లో వీసా దరఖాస్తు చేసుకున్న 240 రోజుల లోపు అభ్యర్థులు అపాయింట్‌మెంట్ తీసుకుని తమ బయోమెట్రిక్ వివరాలు సమర్పించి వీసా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.