తిరుమల శ్రీవారి భక్తులకు అదిరిపోయే శుభవార్త అందింది. తిరుమలలోఇవాళ టిటిడి చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో హై లేవల్ కమిటి సమావేశం జరుగనుంది. నడకదారి భక్తులుకు భధ్రత కల్పన పై ఇవాళ టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.దర్శన టోకేన్ల కోసం నడకదారిలో వెళ్ళే భక్తుల ఇక్కట్లు తోలగించే యోచనలో టీటీడీ పాలక మండలి ఉన్నట్లు సమాచారం అందుతోంది. నడకదారి భక్తులకు జారి చేసే దర్శన టోకేన్ల విధానాని రద్దు చేసి సర్వదర్శన టోకేన్లు సంఖ్యను పెంచే యోచనలో ఉందట టీటీడీ పాలక మండలి. సర్వదర్శన టోకేన్లు 15 వేల నుంచి 30 వేలకు పెంచే యోచనలో టీటీడీ పాలక మండలి ఉన్నట్లు సమాచారం అందుతోంది. దీంతో నడకదారిలో మొక్కులు వున్న భక్తులే వెళ్తారని భావిస్తోంది టీటీడీ పాలక మండలి.