Business

BSNL సరికొత్త రీచార్జ్ ప్లాన్స్-TNI నేటి వాణిజ్య వార్తలు

BSNL సరికొత్త రీచార్జ్ ప్లాన్స్-TNI నేటి వాణిజ్య వార్తలు

BSNL సరికొత్త రీచార్జ్ ప్లాన్స్

జియో, ఎయిర్టెల్కు పోటీగా ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL సైతం సరికొత్త రీచార్జ్ ప్లాన్స్తో ముందుకు వస్తోంది. రూ.184, రూ. 18, రూ.186కే అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకి 1జీబీ డేటా అందించేలా ప్లాన్స్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్స్ మధ్య ప్రయోజనాల్లో కొద్దిపాటి వ్యత్యాసాలుండగా రూ.200లోపు మంచి ప్లాన్స్ అని వినియోగదారులు అంటున్నారు. 28 రోజుల వ్యాలిడిటీతో BSNL ఈ ప్యాక్లను అందిస్తోంది.

*  లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం మార్కెట్లు ప్రారంభమైన వెంటనే అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలతో నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత ఐటీ, టెక్ సూచీల అండతో పుంజుకుని చివరకు లాభాల్లో ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 79 పాయింట్లు లాభపడి 65,402కి చేరుకుంది. నిఫ్టీ 6 పాయింట్ల స్వల్ప లాభంతో 19,435 వద్ద స్థిరపడింది. 

ఇండిపెండెన్స్‌ డే  సందర్భంగా 1515కే విమాన టికెట్‌

బడ్జెట్‌ ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ఇండిపెండెన్స్‌ డే  సందర్భంగా గుడ్‌ న్యూస్‌ చెప్పింది. “ప్రత్యేక ఇన్‌క్రెడిబుల్ ఇండిపెండెన్స్ డే సేల్” పేరుతో స్పెషల్‌ సేల్‌ ప్రకటించింది. దీని ప్రకారం  ఆగస్ట్ 14నుంచి ఎంపిక చేసిన దేశీయ డైరెక్ట్ వన్-వే ఫ్లైట్‌లలో ఈ సేల్ రూ.1,515 నుండి ప్రారంభమవుతుంది.  అలాగే  రూ. 2,000 వరకు ఉచిత విమాన వోచర్‌లను పొందవచ్చు మరియు రూ. 15 నుండి ప్రాధాన్య సీట్ ఎంపికను పొందవచ్చు.అంతేకాదు రూ. 15కే నచ్చిన సీటు ఎంపిక్ చేసుకోవచ్చు. కంపెనీ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు ఫస్ట్‌  కమ్‌ ఫస్ట్‌ సర్వ్‌  కింద ఈ టికెట్లు అందుబాటులో ఉంటాయని  కంపెనీ వెల్లడించింది. ఆగస్ట్ 14- ఆగస్ట్ 20 వరకు అందుబాటులో ఉండే  ఇండిపెండెన్స్ డే సేల్ ఆఫర్‌లో భాగంగా  కేవలం రూ. 1515కే (వన్ వే టికెట్)  విమాన టికెట్‌నుకొనుగోలు  చేయవచ్చు. దీంతోపాటు ఫ్రీ ఫ్లైట్ వోచర్, రూ. 15కే సీటు సెలెక్షన్ వంటి సర్వీసులు అందిస్తోంది.  ఇలా బుక్‌ చేసుకున్న టికెట్ల ద్వారా  ఆగస్ట్ 15 నుంచి 2024 మార్చి 30 వరకు ప్రయాణించవచ్చు.మరోవైపు బలమైన విమాన ప్రయాణ డిమాండ్ కారణంగా స్పైస్‌జెట్  జూన్‌తో   ముగిసినతొలి  త్రైమాసికంలో రూ. 205 కోట్ల నికర లాభాన్ని నివేదించింది.  గత ఏడాది ఇదే క్వార్టర్‌లో రూ. 789 కోట్ల నష్టాలను నమోదు చేసింది.   దేశీయంగా  ఉన్న డిమాండ్‌ కారణంగా 90 శాతం నమోదు చేసినట్లు ఎయిర్‌లైన్ తెలిపింది.మొత్తం నిర్వహణ ఆదాయం మాత్రం క్షీణించింది. అంతకు ముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 2,457 కోట్లతో పోలిస్తే ఆదాయం రూ. 2,002 కోట్లుగా ఉంది.ఎబిట్టా మార్జిన్‌ 525 కోట్లుగా  ఉన్నాయి.

 *  పతనమైన అదానీ స్టాక్స్

అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ అడిటర్‌గా డెల్లాయిట్ రాజీనామా చేయడంతో సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలో అదానీ గ్రూప్ సంస్థల షేర్లు పతనం అయ్యాయి. ఇంట్రాడే ట్రేడింగ్‌లో అదానీ గ్రూప్ ఫ్లాగ్ షిప్ సంస్థ అదానీ ఎంటర్ ప్రైజెస్ స్టాక్స్ 5.4 శాతం పతనమై రూ.2401.10 వరకు పడిపోయి తిరిగి రూ.2422.25 (4.58 శాతం నష్టం) వద్ద నిలిచింది. ఇక అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ షేర్ దాదాపు నాలుగు శాతం నష్టంతో ఇంట్రా డే కనిష్ట స్థాయి రూ.771కి పడిపోయి.. తిరిగి రూ.778.90 (2.72 శాతం నష్టం) వద్ద ట్రేడ్ అవుతున్నది.డెల్లాయిట్ రాజీనామా చేయడంతో తాము కత్తగా ఎంఎస్కేఏ అండ్ అసోసియేట్స్ సంస్థను అడిటర్‌గా నియమించుకున్నట్లు శనివారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ వెల్లడించింది. ఎంఎస్కేఏ అండ్ అసోసియేట్స్.. ప్రపంచంలోని ఆరు టాప్ అడిటింగ్ సంస్థల్లో ఒకటి.అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ అడిటర్‌గా వైదొలిగిన డెల్లాయిట్.. అదానీ గ్రూప్ సంస్థలపై యూఎస్ షార్ట్ షెల్లర్ కంపెనీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికలోని అంశాలపై ఆందోళన వ్యక్తం చేసింది. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ సంస్థకు సంబంధించి హిండెన్ బర్గ్ లేవనెత్తిన అంశాలపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేసింది. దీనికి అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ అంగీకరించలేదని తెలుస్తున్నది.ఇదిలా ఉంటే, అదానీ గ్రూప్ సంస్థలపై దర్యాప్తు చేస్తున్న స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ నివేదిక సమర్పించడానికి మరో 15 రోజుల గడువు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరింది. దీనిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.

లాట్ మొబైల్స్, తమ 11వ వార్షికోత్సవం సందర్భంగా భారీ ఆఫర్లు

 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో 150కి పైగా విక్రయశాలలున్న లాట్ మొబైల్స్, తమ 11వ వార్షికోత్సవం సందర్భంగా భారీ ఆఫర్లు ఇస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ ఎం.అఖిల్ తెలిపారు. రూ.20,000 విలువైన స్మార్ట్‌ఫోన్‌ కొంటే రూ.3,999 విలువైన ఎయిర్‌బడ్స్‌ను రూ.11కి; రూ.10,000 స్మార్ట్‌ఫోన్‌ కొంటే వైర్‌లెస్‌ బ్లూటూత్‌ హెడ్‌సెట్‌ను రూ.11కి అందించబడుతుంది. ప్రతి స్మార్ట్‌ఫోన్‌, స్మార్ట్‌టీవీ, ఎయిర్‌ కండీషనర్‌, ఇతర ఎలక్ట్రానిక్స్‌పై రూ.2,500 వరకు ఇన్‌స్టాంట్‌ రాయితీ, కచ్చితమైన బహుమతిని అందజేస్తున్నారు. రూ.16,500 నుంచి లభించే బ్రాండెడ్‌ ల్యాప్‌టాప్‌లపై 7.5% క్యాష్‌బ్యాక్‌లు లభిస్తాయి. శామ్‌సంగ్‌ ఫోల్డ్‌5/ఫ్లిప్‌5 స్మార్ట్‌ఫోన్‌లపై రూ.30,000 వరకు ప్రయోజనాలు, యాపిల్‌ ఐఫోన్‌లు/ఐపాడ్‌లపై రూ.7,000 వరకు; వివో-ఓపో ఫోన్లపై రూ.10,000 వరకు, ఒన్‌ప్లస్‌-ఎంఐ-రియల్‌మీ ఫోన్‌లపై రూ.5,000 వరకు రాయితీ పరిశీలన. పేటీఎం/మొబిక్విక్‌ వాలెట్‌ కొనుగోళ్లపై 5% నగదు వెనక్కి

నేడు స్థిరంగా బంగారం ధరలు

మహిళలు ఎక్కువగా కొనుగోలు చేసే బంగారం ధరలు కొద్ది రోజుల నుంచి పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్లు జరుగుతుండటంతో బంగారం రేట్లు భారీగా పెరుగుతున్నాయి. ఒక హైదరాబాద్‌లో నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ. 54,650గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేట్లు రూ. 59, 620 గా ఉంది. దీంతో ప్రజలు కొనాలంటే భయపడుతున్నారు.

మోకిల ఫేజ్-2 భూవేలానికి నోటిఫికేషన్ విడుదల

TS: HYDలో మరో భారీ భూవేలానికి ప్రభుత్వం సిద్ధమైంది. మోకిల ఫేజ్-2 భూవేలానికి HMDA నోటిఫికేషన్ విడుదల చేసింది. 300 ప్లాట్లలో 98,975 గజాలను ప్రభుత్వం అమ్మకానికి ఉంచింది. లేఔట్లో 300 నుంచి 500 గజాల ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఈనెల 21 వరకు రూ. 1,180 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, వేలంలో పాల్గొనే వారు రూ.లక్ష డిపాజిట్ చేయాలని HMDA పేర్కొంది. చదరపు గజానికి రూ.25వేలు కనీస ధరగా నిర్ణయించింది.

ఇంజ‌నీరింగ్‌కు సంబంధించిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇవ్వ‌డంలో చాట్‌జీపీటీ విఫ‌లం

 గ‌త ఏడాది నవంబ‌ర్‌లో ఏఐ జ‌న‌రేటివ్ టూల్ చాట్‌జీపీటీ (ChatGPT) లాంఛ్ అయిన త‌ర్వాత ఈ చాట్‌బాట్‌కు విశేష ప్రాచుర్యం లభించింది. చాట్‌జీపీటీ టెక్ ప్ర‌పంచంలో హాట్ డిబేట్‌గా మార‌డంతో పలు దిగ్గ‌జ సంస్ధ‌లు ఏఐ టూల్స్‌ను లాంఛ్ చేయ‌గా మ‌రికొన్ని కంపెనీలు ఏఐ టూల్స్‌పై క‌స‌ర‌త్తు సాగిస్తున్నాయి. చాట్‌జీపీటీతో పలు ఉద్యోగాలు రీప్లేస్ అవుతాయ‌నే ఆందోళ‌న స‌ర్వత్రా వ్య‌క్త‌మైంది. అయితే ఈ చాట్‌జీపీటీ క‌చ్చితత్వంపై మ‌రోసారి సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీరింగ్‌కు సంబంధించిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇవ్వ‌డంలో ఈ చాట్‌బాట్ త‌డ‌బ‌డింది. ఈ విభాగంలో 52 శాతం ప్ర‌శ్న‌ల‌కు స‌రైన స‌మాధానం ఇవ్వ‌డంలో చాట్‌జీపీటీ విఫ‌ల‌మైంద‌ని అమెరికాకు చెందిన ప‌ర్‌డ్యూ యూనివ‌ర్సిటీ చేప‌ట్టిన అధ్య‌య‌నం స్పష్టం చేసింది. స్టాక్ ఓవ‌ర్‌ఫ్లో (ఎస్ఓ)కు సంబంధించి 517 ప్ర‌శ్న‌లు సంధించ‌గా వీటిలో ఏకంగా 52 శాతం స‌మాధానాలు స‌రైన‌వి కాద‌ని ప‌రిశోధ‌కులు గుర్తించారు. ప్ర‌శ్న‌ల వెనుక ఉన్న కాన్సెప్ట్‌ను ఏఐ చాట్‌బాట్ అర్ధం చేసుకోవ‌డంలో విఫ‌లమైనందునే స‌రైన స‌మాధానాలను ఏఐ టూల్ రాబ‌ట్ట‌లేక‌పోయింద‌ని ప‌రిశోధ‌కుల బృందం ప‌సిగ‌ట్టింది.ఏఐ టూల్ ప‌రిమిత రీజ‌నింగ్ సామ‌ర్ధ్యాల‌పైనా ఈ బృందం ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తింది. మ‌రోవైపు చాట్‌జీపీటీ యూజ‌ర్ల సంఖ్య త‌గ్గుముఖం ప‌డుతున్న‌ద‌ని అన‌లిటిక్స్ ఇండియా మ్యాగ‌జైన్ ఇటీవ‌ల వెల్ల‌డించింది. జూన్‌, జులై మాసాల్లో చాట్‌జీపీటీ యూజ‌ర్ల సంఖ్య గ‌ణ‌నీయంగా ప‌డిపోయింది. చాట్‌జీపీటీ క్రియేట‌ర్ ఓపెన్ఏఐ ఇంకా లాభాల బాట ప‌ట్ట‌లేద‌ని ఈ రిపోర్ట్ పేర్కొంది. కంపెనీ న‌ష్టాలు పెరిగిపోవ‌డం, ఇన్వెస్ట‌ర్ల జేబు నుంచి నిర్వ‌హ‌ణ ఖ‌ర్చులు రావ‌డం గ‌గ‌నంగా మారే ప‌రిస్ధితి క‌నిపిస్తోంద‌ని తెలిపింది. చాట్‌జీపీటీ లాభాల బాట ప‌ట్ట‌క‌పోతే ప్ర‌మోటింగ్ కంపెనీ ఓపెన్ఏఐ దివాళా దిశ‌గా ప‌య‌నిస్తుంద‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

హైదరాబాద్‌లో విక్రయం కావాల్సిన ఫ్లాట్లు 5% పెరిగినట్లు డేటా

ఈ ఏడాది మార్చి త్రైమాసికంతో తాజా, జూన్ త్రైమాసికం చివరకు హైదరాబాద్‌లో విక్రయం కావాల్సిన ఇళ్లు/ఫ్లాట్లు 5% పెరిగినట్లు డేటా విశ్లేషణ సంస్థ ప్రాప్‌ఈక్విటీ నివేదిక. అమ్ముడవ్వాల్సిన ఇళ్ల సంఖ్య 95,106 నుంచి 99,989 కి పెరిగింది. దేశంలోని 9 ప్రధాన నగరాలన్నీతే మాత్రం ఈ సంఖ్య 5,26,914 నుంచి 2% తగ్గి 5,15,169కి పరిమితమైందని ఆ నివేదిక పేర్కొంది. కొన్ని నగరాల్లో అమ్ముడవ్వాల్సిన ఇళ్ల సంఖ్య తగ్గితే, నగరాల్లో పెరిగాయి. జూన్ త్రైమాసికంలో ఇళ్ల సరఫరాలు 1,10,468గా ఉంటే, విక్రయాలు 1,22,213కు చేరినట్లు తెలుస్తోంది.

నేడు LPG గ్యాస్ సిలిండర్ ధరలు

నిత్యవసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. ఇటీవల 19 కేజీల గ్యాస్ సిలిండర్ రేట్లను తగ్గించిన ఆయిల్ కంపెనీలు.. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో సామాన్య ప్రజలు మండిపడుతున్నారు.స్థిరంగా కొనసాగుతున్న గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే..హైదరాబాద్:రూ. 1,155,వరంగల్:రూ. 1,174,విశాఖపట్నం:రూ. 1,112,విజయవాడ:రూ. 1,118,గుంటూరు:రూ. 1,114