NRI-NRT

సింగపూర్‌లో ప్రవాసుల రక్తదానం

సింగపూర్‌లో ప్రవాసుల రక్తదానం

13 ఆగష్టు 2023 న సింగపూర్ తెలుగు సమాజం వారు రెడ్‌క్రాస్ సహకారంతో, సింగపూర్ జాతీయ దినోత్సవం (09-అగష్ట్), మరియు భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని (15- ఆగష్ట్) పురస్కరించుకుని రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రక్తదాన కార్యక్రమాన్ని రెండు చోట్ల HSA ఔట్రం రోడ్ మరియు కొత్తగా ఏర్పాటైన వన్ పుంగోల్ లో ఏకకాలంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సింగపూర్ లోని తెలుగు వారి నుండి అద్భుత స్పందన లభించింది. HSA ఔట్రం రోడ్ లోని శిబిరానికి 50 మంది దాతలు, వన్ పంగోల్ లోని శిబిరానికి 25 మంది దాతలు రక్తదాన కార్యక్రమంలో పాల్గొని తమ మానవత్వాన్ని చాటుకున్నారు.ప్రత్యేకంగా కుంకు వరలక్ష్మి మరియు నాగేశ్వరరావు దంపతులు ఇద్దరూ రక్తదానం చేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. రక్తదానం చేస్తే మనం మరింత ఆరోగ్యంగా ఉంటామని అందరూ ఉత్సాహంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.

సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు శ్రీ బొమ్మా రెడ్డి శ్రీనివాసులు రెడ్డి దాతల పరోపకారానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రక్తదానం గురించి అందరూ అవగాహన పెంచుకోవాలని చెప్పారు. అందరూ రక్తదానం చేయాలని,ఎవరైనా రక్తం కావాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా చేసిన అభ్యర్థనలను, షేర్ చేసి తమ సహాయాన్ని అందించాలన్నారు.

సింగపూర్ తెలుగు సమాజం ఇలాంటి రక్తదాన శిబిరాలను అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తున్నదని, ప్రత్యేకించి కోవిడ్-19 మహమ్మారి సమయంలో అంకితభావంతో వరుసగా 9 సార్లు రక్తదాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి అనిల్ కుమార్ గుర్తు చేశారు.

HSA ఔట్రం రోడ్ లోని శిబిరానికి వైదా మహేష్, రాపేటి జనార్దన రావు ,బోయిని సమ్మయ్య, గాడిపల్లి చంద్ర మౌళి, బద్దం జితేందర్ సమన్వయకర్తలుగా పనిచేశారు. అలాగే వన్ పుంగోల్ లో జ్యోతీశ్వర్ రెడ్డి, పాలేపు మల్లిక్, పుల్లన్నగారి శ్రీనివాస రెడ్డి, బచ్చు ప్రసాద్, టేకూరి నగేష్ మరియు కొత్త సుప్రియ సమన్వయకర్తలుగా వ్యవహరించారు.
పెద్ది శేఖర్ రెడ్డి మరియు బైరి రవి ల బృందం చాలా ఉత్సాహంగా కార్మిక సోదరులతో పాల్గొని రక్తదానం చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన దాతలకు మరియు సేవాదళానికి కార్యక్రమ నిర్వాహకులు జూనెబోయిన అర్జున రావు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అందరి సమిష్టి కృషి వలనే కార్యక్రమం విజయవంతమైనదని చెప్పారు. ఈ సందర్భంగా తమ తదుపరి రక్తదాన కార్యక్రమం 29 అక్టోబర్ 2023 న నిర్వహించబోతున్నామని, మరిన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.