అమెరికాలోని డల్లాస్ నగరంలో తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష స్థానిక ఎన్నారై తెదేపా శ్రేణులతో సమావేశమయ్యారు. గౌతు శిరీష మాట్లాడుతూ రాష్ట్రం నాలుగున్నర సంవత్సరాలుగా అన్ని రంగాల్లో సమూలంగా నాశనం జరిగిందని ప్రతిరోజు తెలుగుదేశం పార్టీ అవసరాన్ని చంద్రబాబునాయుడు నాయకత్వాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని, యువగళం పాదయాత్రకు మంచి స్పందన లభిస్తోందని అన్నారు. చింతమనేని సుధీర్, కొమ్మన సతీష్, కొల్లా అశోక్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు నాయకత్వాన్ని ఏపీ కోరుకుంటోంది: డల్లాస్‌లో గౌతు శిరీష
Related tags :