కరోనా తర్వాత భారత్ సామర్థ్యం ప్రపంచానికి తెలిసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఎర్రకోటపై జాతీయ పతాకావిష్కరణ అనంతరం జాతినుద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘‘కొత్త ప్రపంచంలో భారత్‌ను విస్మరించడం ఎవరి తరమూ కాదు. మధ్యతరగతి సొంతింటికల సాకారానికి కొత్త పథకం తీసుకురాబోతున్నాం. బ్యాంకు రుణాలపై రాయితీ ఇచ్చే కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నాం. పట్టణ ప్రాంతాల దిగువ, మధ్యతరగతి సొంతింటి కల సాకారమే లక్ష్యంగా పథకాన్ని రూపొందిస్తున్నాం. ₹లక్షల్లో ప్రయోజనం కల్పించే ఈ పథకం త్వరలో ప్రకటిస్తాం’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు.