* నీట్ ర్యాంకు రాలేదని విద్యార్థి ఆత్మహత్య
రెండుసార్లు ప్రయత్నించినా నీట్ పరీక్షలో ర్యాంకు రాలేదని ఓ విద్యార్థి బలన్మరణానికి పాల్పడ్డాడు. చేతికి అందొచ్చిన కుమారుడి మరణవార్త విని, తీవ్ర మనస్తాపానికి గురైన తండ్రి ఆ మరుసటి రోజే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన తమిళనాడు రాజధాని చెన్నై పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.జగదీశ్వరన్ అనే విద్యార్థి 2022లో 12వ తరగతి పూర్తి చేశాడు. ఈ క్రమంలో వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌కు శిక్షణ తీసుకున్నాడు. అయితే రెండు ప్రయత్నాల్లో అతడు ఆశించిన ఫలితం పొందలేకపోయాడు. దాంతో మనస్తాపానికి గురైన జగదీశ్వరన్.. శనివారం ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుమారుడి మృతిని తట్టుకోలేక తండ్రి సెల్వశేఖర్ మరుసటి రోజు ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ విషాద ఘటనలపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఇలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని, ఆత్మవిశ్వాసంతో జీవితంలో ముందుకు వెళ్లాలని కోరారు. అలాగే కొన్ని నెలల్లో రాజకీయంగా మార్పులు వస్తే.. నీట్ అడ్డంకులు తొలగిపోతాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పుడు ‘నేను సంతకం చేయను’ అనేవారు అదృశ్యమవుతారని గవర్నర్‌ను ఉద్దేశించి విమర్శలు చేశారు.
* కరీంనగర్‌లో దారుణ ఘటన
కరీంనగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. సోమవారం మార్కండేయ కాలనీలో భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను హత్య చేసి అనంతరం భర్త ఉరి వేసుకుని ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ : మార్కెండయ్య కాలనీ లో నివాసముంటున్న భార్య వేముల లావణ్య (42)ను భర్త వేముల ప్రవీణ్ (50) హత్య చేశాడు.. ఈ హత్య చేసి రెండు రోజులైంది.. అయితే ఎవరికీ తెలీయకుండా భార్య మృతదేహాన్ని ఇంటిలోనే దాచి ఉంచాడు.. ఆదివారం నాడు హస్టల్ ఉండి చదువుకుంటున్నన కుమార్తెను చూసి నేటి ఉదయం ఇంటికి వచ్చాడు.. ఆ తర్వాత అతడు ఉరి వేసుకుని చనిపోయాడు .. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
* మధ్యప్రదేశ్ లో దారుణం
మధ్యప్రదేశ్ లోని బోపాల్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. 16 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి నెలల తరబడి అత్యాచారం చేశారు. ఈ ఘటన శనివారం మధ్యప్రదేశ్ లోని షాజహనాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.మైనర్‌ను గతేడాది అక్టోబర్‌లో అభిషేక్ (పేరు మార్చాం) అనే 19 ఏళ్ల యువకుడు అపహరించినట్లు పోలీసులు తెలిపారు. ఆమెను పెళ్లి చేసుకుంటాననే సాకుతో.. నిందితుడు ఆమెను ఖాండ్వా వైపు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. వారు భోపాల్‌కు తిరిగి వచ్చినప్పుడు, ఆమె పరిస్థితి క్షీణించింది.ఇది గమనించిన ఆమె తల్లి ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లింది, బాలికను పరీక్షించిన వైద్యులు ఆమెకు గర్భవతి అని చెప్పారు. దీంతో అపహరణ, అత్యాచారం కింద కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు.
* స్క్రీన్ షేరింగ్ యాప్‌తో లక్షలు కొట్టేశారు!
టెక్నాలజీ (టెక్నాలజీ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. దానితో రకరకాల యాప్‌లు (మొబైల్ యాప్) ఫోన్ ప్లేస్టోర్‌లోకి వస్తున్నాయి. తాజాగా ‘రస్ట్ డెస్క్’ అనే యాప్‌ను ఆసరా చేసుకొని సైబర్ నేరగాళ్లు రూ.4 లక్షలు కొట్టేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం మంగళూరులోని మేరీ హిల్‌కు చెందిన డెబ్బై ఏళ్ల వృద్ధుడు కొంత కాలంగా మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో (మ్యూచువల్ ఫండ్స్) పెట్టుబడులు పెడుతున్నాడు. షేర్ల గురించి మరింత విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని భావించి ఇంటర్నెట్‌లో శోధించాడు. ఆ ఆగస్టు 10వ తేదీన ఓ నంబర్‌కు ఫోన్ చేశాడు. అవతలి వ్యక్తి మరో నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించాడు. అతను చెప్పిన నంబర్‌కు ఫోన్ చేయగా.. ఓ మహిళ వృద్ధుడితో మాట్లాడింది. తాను మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నానని ఆమెకు వివరించగా.. మరో నంబర్ నుంచి ఫోన్ చేసి ‘రస్ట్ డెస్క్’ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలని చెప్పింది. బాధితుడు ఆ యాప్‌ను వెంటనే తన ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్నాడు. ఆ తరువాత స్క్రీన్ మొత్తం ఎర్రర్ చూపించింది. ఏం జరిగిందో తెలియక ఫోన్ పక్కన పెట్టేశాడు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో బ్యాంక్ ఆఫ్ బరోడా అకౌంట్ నుంచి రూ.2లక్షలు, రెండు ఎస్బీఐ అకౌంట్ల నుంచి రూ.1.43 లక్షలు, రూ.35 వేలు, ఇండియన్ బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.26 వేలు డ్రా చేసినట్లు సందేశం రావడంతో కంగు తిన్నాడు. తాను మోసపోయినట్లు గ్రహించి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గత నెలలో ఓ వ్యాపారవేత్త సైతం ఇలాగే రూ.57 వేలు పోగొట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.
* పల్నాడు జిల్లా రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. మృతులు చిలకలూరిపేట మండలం కట్టుబడివారిపాలెంకు చెందిన రమేశ్, బాలకృష్ణగా పోలీసులు గుర్తించారు. అన్నదమ్ములిద్దరూ కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగం చేస్తున్నారు. సీఆర్పీఎఫ్లో ఉద్యోగం చేస్తున్న రమేశ్.. విశాఖలో విధులు నిర్వహిస్తున్నారు. నావిగేషన్ శిక్షణ కోసం చెన్నైకి వెళ్లి తిరిగి వెళ్లే క్రమంలో.. తన 6 నెలల పాపను చూసేందుకు రమేశ్ ఇంటికి వచ్చారు. ఇవాళ రమేశ్ విశాఖ వెళ్తుండటంతో రైలు ఎక్కించేందుకు తమ్ముడు బాలకృష్ణ.. బైకుపై తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఒకే ప్రమాదంలో ఇద్దరి కుమారులను పోగొట్టుకోవటంతో.. ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. వీరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలనలు చేపట్టారు.
* స్నేహం కోసం ప్రాణం ఇస్తానంటూ యువకుడు మృతి
స్నేహం కోసం ప్రాణమిస్తానని చెప్పే వ్యక్తులు మన చుట్టూ ఎందరో ఉంటారు. సరదాగా ఫ్రెండ్ ఎవరైనా ప్రాణం ఇవ్వురా అని అంటే.. ఏదో మాట వరసకు అన్నాడేమోలే అని వదిలేస్తాం. కానీ కడప జిల్లాకు చెందిన ఓ యువకుడు మాత్రం తన స్నేహితుల కోసం ప్రాణాలు ఇస్తా అంటూ మద్యం మత్తులో అవేశానికి లోనై నిజంగానే తన ప్రాణాలు కోల్పోయాడు. కడప నగరంలోని పాత మున్సిపాలిటీ కార్యాలయంలో ఆదివారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఇబ్రహీం అనే వ్యక్తి మద్యం మత్తులో ఉండి స్నేహితుల కోసం ప్రాణాలు ఇస్తానంటూ కాలు దగ్గర కత్తితో కోసుకున్నాడు.అయితే కత్తి గాయం కారణంగా కాలి నుంచి పెద్ద మొత్తంలో రక్తస్రావం కావడంతో ఇబ్రహీం ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో మృతి చెందిన ఇబ్రహీం కడప నగరంలోని నకష్‌కు చెందిన వ్యక్తి అని, అతనిపై గతంలో పలు కేసులు నమోదైయ్యాయని పోలీసులు గుర్తించారు. పలు కేసులలో నిందితుడు అయిన ఇబ్రహీం మరణించడంతో అతని మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.అయితే మద్యం సేవించే సమయంలో స్నేహితుల మద్య మాటా మాట పెరగడం , స్నేహానికి తాను ఎంతో విలువ ఇస్తానని, స్నేహితుల కోసం ప్రాణాలు ఇస్తానని ఇబ్రహీం ఆవేశానికి లోనై తన కాలుని కత్తతో కోసుకున్నాడని, అలా చేయడంతో రక్త స్రావం బాగా జరిగి అతను ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. అర్దరాత్రి సమయంలో ఈ సంఘటన జరగడంతో ఇది తననంతట తాను కోసుకున్నాడా లేక స్నేహితులతో మరేదైనా ఇష్యూ జరిగిందా అనే కోణంలో కూడా కడప పోలీసులు ఇబ్రహీం మిత్రులను ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం సంఘటనపై అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నారు.
* విద్యుత్ షాక్ తో రైతు మృతి
విద్యుత్ షాక్ తో రైతు మృతి చెందిన సంఘటన సోమవారం మండల పరిధిలోని ఛింతల్ దీన్నే గ్రామంలో చోటు చేసుకుంది.గ్రామస్తుల సమాచారం మేరకు కావాలి హన్మంతు (49) తన వ్యవసాయ పొలం దగ్గర ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫర్ కు మరమ్మతు చేసేందుకు ప్రయత్నిస్తుండగా విద్యుత్ షాక్ కు గురై అక్కడిక్కడే మృతి చెందారు.అందరితో కలసి మెలసి ఉండే వ్యక్తి మృతి చెండడంపట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
* భార్యకు ఇన్‌స్టాలో విపరీతమైన ఫాలోయింగ్
ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తనకంటే భార్యకు అత్యధిక సంఖ్యలో ఫాలోయర్లు ఉండటాన్ని భర్త జీర్ణించుకోలేక పోయాడు. దీనికితోడు భర్తను భార్య బ్లాక్ చేసింది. దీంతో భార్యతో గొడవకు దిగి, ఆమెను హత్య చేశాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,యూపీ రాజధాని లక్నోకు చెందిన 37 యేళ్ల ఓ వ్యాపారవేత్తకు భార్య, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నాడు. వీరిద్దరికీ సోషల్ మీడియా ఉపయోగించే అలవాటు ఉంది. వీరికి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు ఉన్నాయి. అయితే, ఇన్‌స్టా ఫాలోయర్ల విషయానికి వస్తే భర్త కంటే భార్యకే అత్యధింగా ఉన్నాయి. దీనికితోడు భర్త ఖాతాను భార్య బ్లాక్ చేసింది. దీంతో వారిద్దరి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. పైగా, తన భార్యకు ఎవరితోనే అక్రమ సంబంధం ఉందనే అనుమానం భర్తకు వచ్చింది. ఈ క్రమంలో ఆదివారం పిల్లలతో కలిసి వారిద్దరూ తమ ఎస్‌యూవీ కారులో రాయ్‌బరేలికి బయలుదేరారు. మార్గమధ్యంలో పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌పై వైపు కారును తిప్పాడు. ఇదే విషయంపై వారిద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. దీంతో తీవ్ర ఆగ్రహం చెందిన భర్త.. భార్య గొంతుకోసి చంపేసాడు. పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి చూడగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తమ ముందే తల్లిని చంపారని పిల్లలు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. వ్యాపారవేత్తను అరెస్టు చేశారు.
* సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని యువతితో శృంగారం
హైదరాబాద్ మహానగరంలోని రాయదుర్గంలో దారుణం చోటు చేసుకుంది. టాలీవుడ్ లోని సినిమాల్లో అవకాశం ఇప్పిస్తామంటూ బిందు అనే యువతిని మోసం చేశాడు పూర్ణ చందర్ అనే వ్యక్తి. అవకాశాల పేరుతో ఆ యువతిని మచ్చిగ చేసుకున్న పూర్ణ చందర్…ఆమెతో కొన్నాళ్లుగా సహజీవనజం చేస్తున్నాడు.అంతేకాదు.. ఆ యువతితో చాలా సార్లు శృంగారంలో పాల్గొన్నాడట. ఇక తాజాగా బిందు ముందే మరొక యువతి తో చెట్టపట్టలేసుకొని పూర్ణ చందర్ తిరిగాడట. ఈ తరుణంలోనే సినిమా అవకాశాల పేరుతో మోసం చేశారని మనస్థాపానికి గురైన బిందు….రాయ దుర్గంలోని 21 అంతస్థుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. బిందు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు పై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇక ఈ కేసుపై విచారణ చేస్తున్న పోలీసులు.. పూర్ణ చందర్…కోసం గాలిస్తున్నారు.
* నెల్లూరు జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం
నెల్లూరు జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో చోరీకి గాయపడ్డారు. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లోనూ దోపిడీకి విఫలయత్నం చేశారు. అయితే చార్మినార్‌ప్రెస్‌లో పోలీసులు అప్రమత్తం కావడంతో దొంగలు పారిపోయారు. ఈ ఆదివారం అర్ధరాత్రి జరిగింది.రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా ఉలవపాడు- తెట్టు రైల్వేస్టేషన్ల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌ను ఉలవపాడు పరిధిలోని సుబ్బరాయుడు సత్రం గేటు వద్ద ఆరుగురు దుండగులు నిలిపివేశారు. అనంతరం దొంగలు రైలులోని ఎస్-1, ఎస్-2, ఎస్-3 బోగీల్లోకి ప్రవేశించిన మహిళల వద్ద సుమారు 30 తులాల బంగారాన్ని చోరీ చేశారు. అనంతరం తెట్టు సమీపంలోని చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపి చోరీకి ప్రయత్నించబోతుండగా.. రైలులోని పోలీసులు అప్రమత్తమై వారిని ఎదుర్కొన్నారు. దీంతో దొంగలు వారిపై రాళ్లు రువ్వి పారిపోయారు. ఆ తర్వాత రైలు ముందుకు కదిలింది. బాధితుల ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు తనిఖీలు చేపట్టారు.