🕉️హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
✍🏻 16.08.2023 ✍🏻
🗓 నేటి రాశి ఫలాలు 🗓
🐐 మేషం
ఈరోజు (16-08-2023)
ఉద్యోగం మారాలనే ఆలోచన కలుగుతుంది. ఆ దిశగా ప్రయత్నాలు సాగిస్తారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా, ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. పిల్లల చదువులపై శ్రద్ధ పెడతారు. దీర్ఘకాలిక ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు ఉపశమనం కలుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. సంసార జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యం పరవాలేదు.
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 వృషభం
ఈరోజు (16-08-2023)
ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధించే అవకాశం ఉంది. స్థిరాస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల సహాయ సహకారాలు ఉంటాయి. వ్యాపారంలో కొత్త పంథాను అనుసరిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు చాలావరకు సానుకూలపడతాయి. కొత్త ఆదాయ మార్గాలను అనుసరించే విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 మిధునం
ఈరోజు (16-08-2023)
ఇతరుల నుంచి వచ్చే విమర్శలను పట్టించుకోకపోవడం మంచిది. కొందరు బంధుమిత్రులు ముఖ్యమైన వ్యవహారాల్లో ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. దైవ కార్యాల్లో లేదా పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. వృత్తి జీవితం బాగా బిజీ అవుతుంది. వ్యాపారాలు అనుకూలంగా సాగి పోతాయి. ఉద్యోగంలో ఆదరణ, ప్రోత్సాహం పెరుగుతాయి. ఉద్యోగం మారాలనుకుంటున్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు.
💑💑💑💑💑💑💑
🦀 కర్కాటకం
ఈరోజు (16-08-2023)
అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. ప్రోత్సాహకాలు కూడా అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఒత్తిడి తప్పకపోవచ్చు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు రాకుండా చూసు కోవాలి. బంధుమిత్రులతో ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. అనుకున్న సమయానికి ఎంతో కష్టపడి ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేయగలుగుతారు. సానుకూల దృక్పథంతో వ్యవహరించడం మంచిది. ఆదాయం, ఆరోగ్యం సానుకూలంగా ఉంటాయి.
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 సింహం
ఈరోజు (16-08-2023)
ఆర్థిక విషయాలకు సంబంధించి ఎటువంటి ప్రయత్నం చేసినా ఆశించిన ఫలితాలుంటాయి. ఇష్ట మైన బంధుమిత్రులను కలుసుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారాలు కలిసి వస్తాయి. విలువైన వస్తు వులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. స్వల్పంగా అనారోగ్యానికి అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి మంచి కబుర్లు వింటారు.
🦁🦁🦁🦁🦁🦁
💃 కన్య
ఈరోజు (16-08-2023)
రావలసిన డబ్బు అందడం, బాకీలు వసూలు కావడం వంటివి జరుగుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యక్తిగత, కుటుంబ అవసరాలు తీరిపోతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబ జీవితం సాఫీగా, సామరస్యంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాలలో కొద్దిగా ఒత్తిడి ఉండవచ్చు. వ్యాపారాలు ఆశించిన స్థాయిలో పుంజుకుంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి.
💃💃💃💃💃💃💃
⚖ తుల
ఈరోజు (16-08-2023)
ఆరోగ్యం, ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటిస్తే రోజంతా అనుకూలంగా, ప్రశాంతంగా సాగిపో తుంది. ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. ఇతరులకు సహాయం చేయగలిగిన పరిస్థితిలో ఉంటారు. కొత్త ప్రయత్నాలు, కొత్త నిర్ణయాలకు సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో మీ పనితీరు అధికారులను ఆకట్టుకుంటుంది. వృత్తి జీవితంలో గౌరవమర్యాదలు పెరు గుతాయి. వ్యాపారాల్లో అంచనాలకు తగ్గట్టుగా లాభాలు గడిస్తారు. ఎవరినీ గుడ్డిగా నమ్మ వద్దు.
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 వృశ్చికం
ఈరోజు (16-08-2023)
ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. సొంత పనులను, అత్యవసర పనులను కూడా సకాలంలో పూర్తి చేసుకోలేకపోతారు. కుటుంబ వ్యవహారాల కారణంగా మానసిక ప్రశాంతత తగ్గుతుంది. సానుకూల దృక్పథంతోనూ, ఓర్పు, సహనాలతోనూ వ్యవహరిస్తే అన్నీ సర్దుకుపోతాయి. కుటుంబ స్థానంలో, సంచరిస్తున్న ‘అర్ధాష్టమ’ శని మధ్య మధ్య అవస్థలు పెడుతూ ఉంటుంది. వృత్తి, ఉద్యో గాలు సవ్యంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో స్తబ్ధత ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 ధనుస్సు
ఈరోజు (16-08-2023)
రోజంతా ప్రశాంతంగా, సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ ఆలోచనలు, మీ వ్యవహారాలు సత్ఫలితాలనిస్తాయి. వ్యాపార జీవితంలో మార్పులు తీసుకు వస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. కొందరు బంధువులకు సహాయం చేయడం కూడా జరుగుతుంది. నిరుద్యోగులకు కోరుకున్న కంపెనీలో ఆశించిన ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. పుణ్య కార్యాలకు సహాయం చేస్తారు. విదేశాల్లో ఉన్న పిల్లల గురించి సానుకూల వార్తలు అందుతాయి.
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 మకరం
ఈరోజు (16-08-2023)
వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంలో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. విలువైన వస్తువులు కొనడంలో పొరపాట్లు చేసే సూచనలున్నాయి. కొందరు స్నేహితులు లేదా దగ్గర బంధువుల వల్ల ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. పిల్లలు చదువుల్లో విజయాలు సాధిస్తారు. ఆదాయ ప్రయత్నాలు సానుకూల ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం పరవాలేదు.
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 కుంభం
ఈరోజు (16-08-2023)
ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్, మదుపుల వల్ల ఆశించిన లాభాలు అందుకుంటారు. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఎవరికీ వాగ్దానాలు చేయడం గానీ, హామీలు ఉండడం కానీ చేయవద్దు. కష్టార్జితం వృథా అయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలు నిలకడగా ముందుకు సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా పురోగతి చెందుతాయి. దూర ప్రాంతంలో ఉన్న బంధువుల ద్వారా పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది.
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 మీనం
ఈరోజు (16-08-2023)
శత్రు, రోగ, రుణ బాధల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతనతో రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. ఆదాయ ప్రయత్నాలు సానుకూలపడతాయి. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగంలో ఆశించిన ప్రోత్సాహం ఉంటుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మీద బాగా ఖర్చు చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.
🦈🦈🦈🦈🦈🦈🦈