ఇటీవల పెరిగిన బంగారం ధరలు దిగొస్తున్నాయి. గత రెండు రోజలు స్థిరంగా కొనసాగిన గోల్డ్ రేట్స్.. నేడు తగ్గాయి. బులియన్ మార్కెట్లో బుధవారం (ఆగష్టు 16) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,550 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 59,510గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 110 తగ్గింది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో ఈరోజు ఉదయం నమోదైనవి. దేశంలోని పలు నగరాల్లో తులం బంగారం ధర ఎలా ఉందో చూద్దాం.ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,660గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,000లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,000 వద్ద కొనసాగుతోంది. ఇక ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,550 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,510గా కొనసాగుతోంది.
మరోవైపు నిన్న భారీగా తగ్గిన వెండి ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర బుధవారం రూ. 72,800లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై ఏ మార్పు లేదు. ముంబైలో కిలో వెండి ధర రూ. 72,800గా ఉండగా.. చెన్నైలో రూ. 76,000గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 71,500 ఉండగా.. హైదరాబాద్లో రూ. 76,000లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 76,000ల వద్ద కొనసాగుతోంది.