Politics

రాహుల్‌ను కలవనున్న భారతీయ అమెరికన్ చట్టసభ సభ్యులు

రాహుల్‌ను కలవనున్న భారతీయ అమెరికన్ చట్టసభ సభ్యులు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భారతీయ-అమెరికన్ చట్టసభ సభ్యులు భేటీకానున్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని భారతీయ అమెరికన్‌ చట్టసభ్యులు కోరినట్టు కాంగ్రెస్‌ సీనియర్‌ ఆఫీస్‌ బేరర్‌ తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం ఢిల్లీని సందర్శించిన ప్రతినిధి బృందంలో భాగమైన భారతీయ-అమెరికన్ చట్టసభ సభ్యులు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో ప్రైవేట్ సమావేశాన్ని షెడ్యూల్ చేయడానికి ఆసక్తిని వ్యక్తం చేశారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఆఫీస్ బేరర్ ప్రవీణ్ చక్రవర్తి ధృవీకరించారు. అయితే వారు ఫార్మల్‌గా కలవాలని అనుకుంటున్నారా? లేకపోతే అధికారికంగా కలవాలనుకుంటున్నారా? అనేది తేలాల్సి ఉంది. యుఎస్ కాంగ్రెస్ ప్రతినిధుల బృందంలోని కొంతమంది సభ్యులు గత రెండు రోజులుగా రాహుల్ గాంధీతో వ్యక్తిగత సమావేశం కావాలని కోరుతూ సంప్రదించారని… రాహుల్‌ గాంధీ వాయనాడ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత ఏదైనా షెడ్యూల్ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పినట్టు కాంగ్రెస్‌ నాయకుడు తెలిపారు.

అధికారిక సమావేశం ఏర్పాటు చేయడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతి ఉంటుందా అని కాంగ్రెస్‌ ప్రతినిధిని ప్రశ్నించగా.. అందుకు అది విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు అమెరికా ప్రతినిధి బృందం మధ్య ఉంటుందని.. అయితే ప్రతిపక్షంలోని ఒప ప్రధాన నాయకున్ని కలవడానికి అమెరికా చట్టసభ్యులు ఆశిస్తున్నప్పుడు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆందోళన చెందాల్సిన అవసరం ఏముంటుందని కాంగ్రెస్‌ నేత ప్రశ్నించారు. అమెరికా ప్రతినిధి బృందం ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్ష నేతతో సమావేశం కావాలనుకుంటే తప్పేముందన్నారు. రాహుల్ గాంధీతో సహా ప్రతిపక్ష నాయకులను కూడా కలుస్తారా అని అడిగినప్పుడు, యుఎస్ కాంగ్రెస్ ప్రతినిధి RO ఖన్నా, కొంతమంది వ్యక్తులను యుఎస్ ప్రతినిధి బృందం కలవాలని కోరుకుంటున్నారని ప్రశ్నించగా.. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ అభ్యర్థనలను ఆమోదించాల్సి ఉంటుందన్నారు. తాము ఈ అభ్యర్థనను చేయలేదని రాహుల్ గాంధీ కార్యాలయం స్పష్టం చేసింది.తాను మరియు ప్రతినిధి బృందం ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రిత్వ శాఖకు అతిథులుగా ఉన్నామని.. వారే దానిని ఏర్పాటు చేయవలసి ఉంటుందని ఖన్నా తెలిపారు. అభ్యర్థనను విదేశాంగ మంత్రిత్వ శాఖకు తెలియజేశాను వారు చెప్పేదాన్ని బట్టి ఉంటుందని తెలిపారు.