దుబాయిలోని తెలుగు ప్రవాస సంఘమైన గల్ఫ్ మైనార్టీ కౌన్సిల్ (జి.యం.సి) 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోంది. దేశ ఎల్లలు దాటి విదేశాలలో అడుగుపెట్టిన అనంతరం దేశ భక్తి మరింత రెట్టింపవుతుందని జి.యం.సి ప్రతినిధి ఫహీం చెప్పారు. పతాకవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ విదేశాలలో ఉండి కూడ భారతం కొరకు మరియు తోటి భారతీయుల కొరకు తపించడమె నిజమైన జాతీయస్ఫూర్తి అని అన్నారు. దుబాయిలో వైవిధ్య భారతీయంలో ఏకత్వం ప్రతిబింబిస్తుందని ఫహీం అన్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల ప్రవాసీయులను కలుపుకోని తమ సంస్ధ ముందుకు వెళ్తుందని ఆయన పెర్కోన్నారు. హార్ ఘర్ తిరంగాను సంవత్సరం పొడువునా పాటించవల్సిన అవశ్యకత ఉందని కూడ ఆయన అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో జి.యం.సి ప్రతినిధులు శేఖ్ అబ్దుల్లా, రిజ్వాన్, జాఫర్, అల్లాబక్ష్ మరియు సెహ్రీష్ లతో పాటు అపెక్స్ అడిటింగ్ సంస్ధ యాజమానులు ఖాజ అబ్దుల్ ముతలిబ్, అజయ్ చతుర్వేది మరియు ఎపి ఎన్నార్టీ కోర్డినేటర్ అక్రంలు పాల్గోన్నారు.
దుబాయిలో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవం
Related tags :