Politics

ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన జగన్

ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన జగన్

దేశవ్యాప్తంగా 77వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.అనంతరంఏర్పాటు చేసిన మీటింగ్​ మాట్లాడుతూ.. ఇన్నేళ్ల దేశ పురోగతిలో ఎన్నో మైలు రాళ్లను చేరుకున్నామని తెలిపారు. గాంధీజీ ఆశయ సాధనకు వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చినా ప్రజా సంక్షేమాన్ని వదలిపెట్టలేదన్నారు.గ్రామ, వార్డు సచివాలయాలతో గ్రామాల రూపురేఖలు మార్చామని తెలిపారు. పేదల సంక్షేమం, విద్యార్థులకు మంచి చదువు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు.