ప్రగతి భవన్‌లో (Pragathi Bhavan) 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) జాతీయ జెండాను ఎగురవేశారు. స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సంతోశ్ కుమార్, ఎమ్మెల్సీలు మధుసూదనా చారి, తక్కళ్లపల్లి రవీందర్ రావు, నవీన్‌రావు, సీఎంఓ అధికారులు, సిబ్బంది, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మరికాసేపట్లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లోని స్మారకం వద్ద సీఎం కేసీఆర్ నివాళులు అర్పించనున్నారు. అక్కడి నుంచి నేరుగా గోల్కొండకు చేరుకుంటారు. కోటపై జాతీయ జెండా ఆవిష్కరించి ప్రసంగించనున్నారు.