తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గృహలక్ష్మి పథకం విషయంలో కీలక ప్రకటన చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన గృహ లక్ష్మీ పథకం విషయంలో నిబంధనలను సులభతరం చేసేందుకు… చర్యలు తీసుకుంటోంది.కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇందిరమ్మ పథకం కింద ఇల్లు పొంది.. ఆర్సీసీ ఆఫ్ కాకుండా ఇతర నిర్మాణాలు చేసుకున్న వారికి కొత్త ఇంటికి మళ్లీ దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పించింది కేసీఆర్ సర్కార్. దీంతో అనేకమందికి ప్రయోజనం చేకూరాలని ఉంది. ఇక ఇప్పటివరకు 14 లక్షలు మంది గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఈ పథకం నిరంతరంగా కొనసాగుతుందని ఇప్పటికే తెలంగాణ మంత్రులు ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ పథకం కింద ఒక్క ఇంటికి మూడు లక్షల చొప్పున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది.