NRI-NRT

శాన్ ఫ్రాన్సిస్కో: ఏఐఏ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

శాన్ ఫ్రాన్సిస్కో:  ఏఐఏ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండో అమెరికన్స్‌ ఏఐఏ ఆధ్వర్యంలో భార‌త స్వాతంత్య్ర దినోత్సవ వేడుక‌లు వైభవంగా జరిగాయి. శాన్‌ ఫ్రాన్సిస్కో, బే ఏరియాలో స్వ‌దేశ్ పేరుతో వేడుకలను నిర్వహించారు. ప‌లువురు ప్రముఖులు హాజరై.. జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించారు. స్వ‌దేశ్ కార్య‌క్ర‌మం ప్ర‌ధాన ఉద్దేశం భార‌త సంస్కృతి, సంప్ర‌దాయాల‌ను ప్ర‌చారం చేయ‌డ‌మేన‌ని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వివిధ రాష్ట్రాల నుంచి వ‌చ్చిన చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని సందడి చేశారు. భారీ భారతీయ జెండా.. పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రవాసులు మువ్వన్నెల జెండాను చేతబూని వందేమాతరం, భారతమాతకి జై అంటూ నినాదాలు చేశారు.