ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) రాసేందుకు దరఖాస్తు గడువు బుధవారంతో ముగియనుంది. సెప్టెంబరు 15న జరిగే పరీక్షకు ఈనెల 2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మంగళవారం నాటికి మొత్తం 2.40 లక్షల దరఖాస్తులు అందాయి. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి దరఖాస్తుదారుల సంఖ్య భారీగా తగ్గే అవకాశం కనిపిస్తోంది. మరో వైపు ఆరు జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను బ్లాక్ చేశారు. హైదరాబాద్, వికారాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కొత్తగూడెం జిల్లాల్లో పరీక్షా కేంద్రాల సామర్థ్యం నిండిపోవడంతో ఇక కొత్తగా దరఖాస్తు చేసేవారికి ఆ జిల్లాల్లో పరీక్ష రాసే వీలుండదు. దీంతో తగినన్ని పరీక్షా కేంద్రాలను ఎందుకు ఏర్పాటు చేయలేదని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.