విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఖుషి. అందమైన లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి . అలాగే ఖుషి మూవీ ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచేసింది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు శివ.
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసి మీదనున్నాడు. లాస్ట్ గా వచ్చిన లైగర్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఇప్పుడు ఆశలన్నీ ఖుషి సినిమా పైనే పెట్టుకున్నాడు. విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఖుషి. అందమైన లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి . అలాగే ఖుషి మూవీ ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచేసింది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు శివ. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్.
సెప్టెంబర్ 1న ఖుషి మూవీని రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే ఖుషి మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ లో విజయ్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ .. సెప్టెంబర్ 1న నా తరుపున ఖుషి తీసుకొస్తున్నా.. ప్రపంచంలో ఎక్కడ ఉన్న ఖుషి పంచుతా అని అన్నారు. చివరిగా ఖుషి ఎప్పుడు ఇచ్చానో గుర్తులేదు అన్నారు విజయ్. నా కు కూడా నవ్వులు చుడాలని ఉంది. ఈ నవ్వులు సమంత మొహం మీద చూడాలని ఉంది . ఈ సినిమా కోసం సమంత చాలా కష్టపడింది. షూటింగ్ చివరిలో సమంత ఆరోగ్యం దెబ్బ తిన్నది. సమంత అనారోగ్యానికి గురైందంటే నేను నమ్మలేదు.
సమంత ఆరోగ్యం గురించి మాట్లాడాలని అనుకోలేదు. సమంతకు కూడా చెప్పను మనం మన బాధలు చెప్పకూడదు అని అన్నాను. కానీ చాలా మంది ఇలాంటి వాటితో బాధపడుతున్నారు. నేను వాళ్లకు దైర్యం చెప్పాలి. అనారోగ్యంగా ఉన్నా కూడా మనం పని చేయగలం అని చెప్పాలి అని తెలిపింది అని చెప్పారు విజయ్. సమంత ఆరోగ్యం ఇప్పుడు కూడా బాలేదు కానీ వచ్చింది. సెప్టెంబర్ సామ్ మొహం మీద నవ్వు చూడాలి అది నా బాధ్యత అన్నారు విజయ్.
స్టేజ్ పై డాన్స్ తో అదరగొట్టిన సమంత, విజయ్ దేవరకొండ.