ScienceAndTech

ఇక పై వాట్సాప్‌లో మనకి నచ్చినట్టు స్టిక్కర్లు

ఇక పై వాట్సాప్‌లో మనకి నచ్చినట్టు స్టిక్కర్లు

మెటాకు చెందిన ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌లో (Whatsapp) కొత్త కొత్త ఫీచర్లు ఎప్పటికప్పుడు సందడి చేస్తున్నాయి. ఈ మధ్యే వీడియో కాల్‌ ద్వారా స్క్రీన్‌ షేరింగ్‌ సదుపాయాన్ని తీసుకొచ్చిన ఆ సంస్థ.. త్వరలో కృత్రిమ మేధకు సంబంధించి ఓ సదుపాయాన్ని తీసుకురానుంది. ఏఐ సాయంతో సులువుగా స్టిక్కర్లను రూపొందించుకునే సదుపాయం తీసుకొస్తున్నట్లు తెలిసింది.ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ బీటా యూజర్లకు ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంది. వాట్సాప్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు అందించే వాబీటా ఇన్ఫో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఫీచర్‌తో వాట్సాప్‌లో ఏఐ సాయంతో మనకు మనమే సొంతంగా అప్పటికప్పుడు స్టిక్కర్లను తయారు చేసుకోవచ్చు. ఇందుకు కావాల్సిన కమాండ్స్‌ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ‘క్యాట్‌ వేరింగ్‌ హ్యాట్‌’, ‘డాగ్‌ ఆన్‌ స్కేట్ బోర్డ్‌’ వంటి కమాండ్లు ఇస్తే దాని బట్టి స్టిక్కర్‌సందర్భానికి తగినట్లుగా రూపొందించే ఈ స్టిక్కర్లు అవతలి వ్యక్తికి కూడా సులువుగా అర్థమవుతాయి. స్టిక్కర్‌ ప్యాలెట్‌లో ఈ ఫీచర్‌ కనిపించనుంది. మెటా ఇందుకు సాంకేతిక సాయం అందించనుంది. అయితే, ఇందుకోసం వాట్సాప్‌ ఎలాంటి ఏఐ మోడల్‌ వాడుతుందనేది తెలియరాలేదు. ప్రస్తుతం టెస్టింగ్‌ దశలో ఉన్న ఈ ఫీచర్‌.. త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది.