ప్రస్తుతం మనం తినే ఆహారాల్లో చేపలు చాలా రుచికరమైన ఆహారం. చేపల్లో పచ్చి, ఎండు చేపలు కూడా ఉంటాయి. ముఖ్యంగా చాలామంది పచ్చి చేపలు తినడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. అయితే మార్కెట్లో ఎండు చేపలు కూడా విరివిగా లభిస్తాయి. మరి ఎండు చేపలు తినడం వల్ల లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ముఖ్యంగా ఎండిపోయిన చేపలలో పాటియాసిడ్స్ ఒమేగా త్రీ, విటమిన్లు ఉంటాయి. అలాగే ఫాస్పరస్ కూడా పుష్కలంగా లభిస్తుంది. ఇందులో ఉండే ఫిష్ ఆయిల్ పొట్టలోని కొవ్వును కరిగించడానికి ఎంతో ఉపయోగపడుతుందట. అంతేకాకుండా ఎండు చేపలు అధిక బరువు లేదా ఉబకాయం ఉన్నవారు తింటే చాలా మేలు కలుగుతుందని నిపుణులు అంటున్నారు.ఎండు చేపల్లో ప్రోటీన్ ప్రధాన వనరుగా ఉంటుంది. 15 రోజులకు ఒకసారి అయినా ఎదిగే పిల్లలకు ఎండు చేపలు తినిపించడం వల్ల వారికి అన్ని రకాల విటమిన్స్ లభించి ఎదుగుదల బాగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాబట్టి ఎండు చేపలను చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరికీ చాలా ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ అని ఆహార నిపుణులు తెలియజేస్తున్నారు.