ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ విద్యుత్ శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. విద్యుత్ శాఖ కు సంబంధించిన ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను ఏకంగా 37% పెంచుతూ విద్యుత్ శాఖ స్పెషల్ సిఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఏకంగా 27,000 మంది ఉద్యోగుల జీతం 21 వేల రూపాయలు దాటింది. అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం కాంట్రాక్ట్ ఏజెన్సీలను ఆదేశించింది. ఇలాగే పని చేస్తే వచ్చే ఏడాది మరింత జీతాలు పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా స్పష్టం చేసింది ప్రభుత్వం. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల… విద్యాశాఖ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.