WorldWonders

చిరుతపులి పై కొండముచ్చులు దాడి

చిరుతపులి పై కొండముచ్చులు దాడి

సాధారణంగా క్రూర జంతువులు చిన్న / సామాన్య జంతువులపై దాడి చేయటం చూస్తాం. కానీ ఇక్కడ కొండముచ్చులు (Baboons) చిరుతపులిని బెంబేలెత్తించాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. కొండముచ్చులు చిరుత పులిని ఎదిరించిన దృశ్యాలను లేటెస్ట్‌ సైటింగ్స్‌ అనే యూట్యూబ్‌ ఛానల్ పంచుకుంది.

దక్షిణాఫ్రికాలో (south africa) ఓ మారుమూల ప్రాంతంలో సుమారు 50 కొండముచ్చుల గుంపు రోడ్డుపై వెళుతోంది. అదే క్రమంలో ఓ చిరుతపులి (Leopard) ఆహారం కోసం రోడ్డుపై నడుస్తూ వచ్చింది.  కొండముచ్చులను (baboons) గమనించిన చిరుత పులి వాటిపైకి దూసుకురాగా ఒక  కొండముచ్చు దానితో పోరాటానికి దిగింది.  వెంటనే మిగతా కొండముచ్చులు అప్రమత్తమై భయంతో పరిగెత్తకుండా.. మూకుమ్మడిగా చిరుతపై ఎదురు  దాడికి తిరిగాయి.  చాలాసేపు అది కొండముచ్చులతో పోరాడినా తర్వాత వాటి దాడికి తట్టుకోలేక అడవిలోకి పారిపోయింది. ఈ సంఘటనతో  రోడ్డుపై ట్రాఫిక్‌కు కొంతసేపు అంతరాయం కలిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ కాగా పలువురు నెటిజన్లు దీనిపై సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ‘ఐకమత్యమే మహాబలం అనేది పిల్లలకు ఎలా వివరించాలో తెలియక ఇన్ని రోజులు ఆందోళన చెందాను. ఇప్పుడు ఈ వీడియో ఒకటి చాలు ఐకమత్యం గురించి చెప్పడానికి’ అని రాసుకొచ్చారు. ‘ఇలాంటి యూనిటీని ఎప్పుడూ చూడలేదని ’ మరొకరు తెలిపారు.