జానంపేట వాసి ఈశ్వర్ రెడ్డి బండా గత 20 ఏండ్లుగా అమెరికాలోనే నివసిస్తున్నారు. అయితే ఆయనకు పుట్టిన ఊరుపై మక్కువ ఎక్కువ. దీంతో తన సొంత ఊరికి రోడ్డు రోడ్డు మంజూరు అయ్యేందుకు ఈశ్వర్‌రెడ్డి బండా చొరవ తీసుకున్నారు. తాళ్లగడ్డ ప్రజల ఇబ్బందులు తొలగించేందుకు పూనుకున్నారు. రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో తనకు గల అనుబంధంతో ఈ అంశంపై చర్చించారు. ఈశ్వర్‌రెడ్డి బండా.. ఇండియాకు వచ్చినప్పుడల్లా తాళ్లగడ్డ ప్రజల రవాణ మార్గంపైనే దృష్టి కేంద్రీకరించారు.
ఇటీవల రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అమెరికాలో పర్యటించినప్పుడు తన వూరికి రోడ్డు నిర్మాణంపై ఈశ్వర్‌రెడ్డి బండా ప్రత్యేకంగా చర్చించారు. దీంతో జానంపేట నుంచి తాళ్లగడ్డ వరకూ రోడ్డు నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశారు. ఈ విషయమై చొరవ తీసుకున్న ఈశ్వర్‌రెడ్డి బండా.. స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డితో ప్రత్యేకంగా ఫోన్ చేశారు.జానంపేట నుంచి తాళ్లగడ్డకు రోడ్డు నిర్మాణానికి అనుమతి మంజూరు చేసినందుకు మంత్రి ఎర్రబెల్లికి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. వీలైనంత త్వరగా రోడ్డు నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరారు. గతంలోనూ ఇక్కడ బ్రిడ్జి నిర్మాణo కోసం ఎన్నారై ఈశ్వర్ రెడ్డి కృషి చేశారు.