తెలుగు సినిమా ఇండస్ట్రీ జనాలకు తమన్నా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్లో, కోలీవుడ్ లో కూడా తన మానియాను పెంచుకుంది. అలాంటి తమన్న ఇండస్ట్రీ లోకి వచ్చి దాదాపు 2 దశబ్దాలు కావొస్తుంది. అయినా ఏమాత్రం తరగని అందంతో హీరోయిన్ గా మరియు స్పెషల్ సాంగ్స్ చేస్తూ తనదైన శైలిలో దూసుకుపోతోంది. అలాంటి తమన్నాను మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ మోసం చేశారట.. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం..
తమన్నా రజనీకాంత్ జైలర్ , మెగాస్టార్ చిరంజీవితో భోళాశంకర్ సినిమాలో నటించింది. కానీ ఈ సినిమాలతో ఆమె సాటిస్ఫైడ్ కాలేదట.. ఇందులో జైలర్ సినిమా సూపర్ హిట్ అయినా కానీ కేవలం ఆమెను పాటలకు మాత్రమే పరిమితం చేశారని, కేవలం అక్కడక్కడ మాత్రమే కనిపించిందని , నువ్వు కావాలయ్యా అనే పాటతో బాగా ఫేమస్ అయింది..కానీ ఈ సినిమాలో ఆమె హడావిడి ఏమీ లేదని బాధపడుతోందట.అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ లో చేసినా ఇందులో గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితం చేశారని, సినిమాలో నటించినా ఆ పాత్రకు అంతగా రెస్పాన్స్ రాలేదని, ఈ విధంగా రెండు చిత్రాల్లో ఆమెను కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం చేసి హీరోయిన్ అనే పేరును కాస్త డ్యామేజ్ చేశారని ఆమె బాధ పడుతుందట. ఒకవేళ ఈ సినిమాలో పాటలతో పాటు స్కోప్ ఉన్న పాత్ర ఇస్తే తనకు ముందు ముందు స్టార్ హీరోలతో ఆఫర్లు వచ్చేవని, ప్రస్తుతం చాలా సినిమాల్లో ఐటమ్ సాంగ్ లకు మాత్రమే పరిమితం చేసేలా ఆఫర్లు వస్తున్నాయని ఆమె బాధ పడిందట