Politics

నేటి నుంచే కాంగ్రెస్ అసెంబ్లీ టికెట్ దరఖాస్తుల ప్రక్రియ

నేటి నుంచే కాంగ్రెస్ అసెంబ్లీ టికెట్ దరఖాస్తుల ప్రక్రియ

రానున్న అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సంసిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై పారదర్శకంగా వ్యవహరించనుంది. ఇందు కోసం పోటీ చేయాలనుకునే ఆశావాహుల నుంచి తెలంగాణ కాంగ్రెస్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ ప్రక్రియలో ఇవాళ్టి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగనుంది.ఇప్పటికే ధరఖాస్తు విధివిధానాలను సబ్ కమిటీ ఖరారు చేసింది. దరఖాస్తుల స్వీకరణ రుసుము విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ధరఖాస్తు చేసుకోవడానికి రూ.25 వేలు, ఓసీలకు రూ.50 వేలు చొప్పున ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఆశావహుల కోసం నాలుగు పేజీల ధరఖాస్తును గాంధీభవన్​లో అందుబాటులో ఉంచారు. వ్యక్తిగత వివరాలతో పాటు, ప్రస్తుత పార్టీలో హోదా, గతంలో పార్టీకి చేసిన సేవ, ఇప్పటి వరకు పొందిన పదవులు, గతంలో ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం, ఎన్నికల్లో గెలుపు ఓటములు, క్రిమినల్ కేసులు, కోర్ట్ శిక్షలతో పాటు పోటీ చేయదలచిన సెగ్మెంట్ తదితర అంశాలను ధరఖాస్తులో పొందుపరచాల్సి ఉంటుంది. అదేవిధంగా గెలిచినా.. ఓడినా పార్టీలోనే ఉంటానంటూ అభ్యర్థుల నుంచి ప్రమాణ పత్రం కూడా తీసుకోనున్నట్లు తెలుస్తోంది.