మగువలకు పండగ లాంటి వార్త అని చెప్పాలి. ఇటీవల రోజుల్లో తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు నేడు మరింత దిగొచ్చాయి. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (ఆగష్టు 18) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,100 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 59,020గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 350.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 380 తగ్గింది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం నమోదైనవి. దేశంలోని పలు నగరాల్లో తులం బంగారం ధర ఎలా ఉందో చూద్దాం.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,250 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,170గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,560లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.59,520 వద్ద కొనసాగుతోంది. ఇక ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,020గా కొనసాగుతోంది.మరోవైపు వెండి ధరలు కూడా తగ్గాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర నేడు రూ. 72,500లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 500 తగ్గింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 72,500గా ఉండగా.. చెన్నైలో రూ. 75,700గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 72,000 ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 75,700లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 75,700ల వద్ద కొనసాగుతోంది.