DailyDose

రోడ్డు మీద డబ్బులు దొరకడం మంచిదేనా?

రోడ్డు మీద డబ్బులు దొరకడం మంచిదేనా?

హిందూ మతంలో ప్రతి చర్యకు కొన్ని నియమాలు వివరించబడ్డాయి. అటువంటి పరిస్థితిలో అనుకోకుండా రోడ్డుమీద వెళ్తునం సమయంలో డబ్బులు కనిపిస్తే.. కూడా అది శుభ, అశుభాలకు సంకేతం అనే విషయాలను సూచిస్తుంది. అందుకే ఈరోజు మనం రోడ్డు మీద దొరికిన డబ్బును తీసుకోవడం శుభమో, అశుభమో తెలుసుకుందాం..

ప్రతిదానికీ నియమాలు హిందూమతంలో చెప్పబడ్డాయి. అటువంటి పరిస్థితిలో రహదారిపై డబ్బులు కనిపిస్తే అది శుభ, అశుభకరమైన విషయాలను సూచిస్తుంది. అందుకే ఈ రోజు మనం రోడ్డు మీద దొరికిన డబ్బును తీసుకోవడం శుభమో, అశుభమో తెలుసుకుందాం.జ్యోతిష్య శాస్త్రంలో, రోడ్డుపై పడిన డబ్బు లేదా నాణేలు కనిపించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఎవరికైనా రోడ్డు మీద పడి ఉన్న నాణేలు కంట పడి ఉంటే, మీకు పూర్వీకుల ఆశీర్వాదం లభించిందని అర్ధం. హిందూ మతం ప్రకారం మరొక సంకేతం ఏమిటంటే, మీరు రోడ్డుపై పడి ఉన్న నాణేలను కనిపిస్తే, మీరు చేసే పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. చైనాలో అయితే ఇలా రోడ్డుమీద దొరికిన డబ్బు లేదా నాణేలను లావాదేవీలకు కాకుండా అదృష్టాన్ని మార్చుకోవడానికి కూడా ఉపయోగిస్తారు.దారిలో ఎక్కడైనా ఒక నాణెం పడి ఉంది.. అది మీకు కనిపిస్తే మీరు ప్రారంభించబోయే కొత్త పనిలో మీరు విజయం సాధిస్తారనే సంకేతం.హిందూ మతం ప్రకారం.. కొంత డబ్బు రోడ్డుపై పడి ఉంటే, దానిని ఆలయానికి విరాళంగా ఇవ్వాలి. పొరపాటున కూడా వాటిని ఖర్చు చేయకూడదు. ఇలా చేయడం వలన మీకు ఆర్ధిక ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం మీరు ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళుతుంటే, ఆ సమయంలో మీకు దారిలో ఒక నాణెం లేదా నోటు దొరికితే, మీరు వెళ్ళే పనిలో మీరు విజయం సాధిస్తారని అర్థం.