Health

మామిడి ఆకుల వల్ల మనకు తెలియని ఎన్నో ప్రయోజనాలు

మామిడి ఆకుల వల్ల మనకు తెలియని ఎన్నో ప్రయోజనాలు

మామిడి చెట్టు మనకి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మామిడి ఆకులు, పువ్వులు, పిందెలు, బెరడు, వేరు అన్నింటినీ ఔషధంగా వాడతారు. మామిడి ఆకులను ఇంటి ముందు కడితే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉంటే, అది ఇతరులకు వ్యాపించకుండా నిరోధిస్తుంది. అంతే కాకుండా మామిడి ఆకులను బాగా వేయించి దానిలో తేనె కలిపి తీసుకుంటే గొంతు నొప్పి సమస్యలు తగ్గుతాయి.మధుమేహంతో బాధ పడే వారు మామిడి ఆకుల పొడిని 2 టీస్పూన్లు కలిపి తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది. అలాగే మామిడి ఆకులను కాల్చి బూడిద చేసి గాయాలపై రాస్తే గాయాలు త్వరగా మానుతాయి. మామిడికాయను ఎండబెట్టి మెత్తగా గ్రైండు చేసుకుని, ఈ మిశ్రమాన్ని బాగా మరిగించి తాగునీరుగా తీసుకుంటే విరేచనాలు తగ్గుతాయి.