అమెరికాలో భాషే రమ్యం, సేవే గమ్యం అంటూ ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ప్లోరిడాలో నిర్వహించిన అన్నమాచార్య కీర్తనల కార్యశాలకి మంచి స్పందన లభించింది. ప్రముఖ ఆధ్యాత్మిక గాయని కొండవీటి జ్యోతిర్మయి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యశాలలో 23 మంది ప్రతిభావంతులైన యువతీ యువకుల బృందం పాల్గొంది. ఈ వర్క్‌షాప్ వర్ధమాన గాయకులు తమ గాత్ర నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి, ఆధ్యాత్మిక సంగీతంలో తమ గాత్ర శుద్ధిని మరింత పెంచుకోవడానికి దోహదపడింది. ఇంటరాక్టివ్ సెషన్లు, స్వర వ్యాయామాలు, గాయకుల తీరును బట్టి వారి చేత చేయించిన స్వర సాధనలు ఈ వర్క్ షాప్‌లో ఔత్సాహిక గాయనీ, గాయకులకు ఎంతగానో ఉపకరించాయి. టంపాబే నాట్స్ కుటుంబ సభ్యులు తమ పిల్లలతో కలిసి చేసిన ఈ వర్క్‌షాప్ విజయవంతం అవ్వడం పట్ల ప్రశంసల వర్షం కురిసింది. తటి చక్కటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో టంపాబే నాట్స్ టీమ్‌లో పనిచేసిన ప్రతి ఒక్కరికీ జ్యోతిర్మయి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో శ్రీనివాస్ బైరెడ్డి, అనిల్ అరెమండ, అచ్చిరెడ్డి శ్రీనివాస్, ప్రహ్లాద్ మాడభూషి, స్వప్న రావిపాటి, రాంబాబు వరిగినేని తదితరులు కీలక పాత్ర పోషించారు.
ఈ కార్యక్రమానికి సహకరించిన నాట్స్ మాజీ ఛైర్మన్, నాట్స్ సంబరాలు 2025 కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డు గౌరవ సభ్యులు డాక్టర్ కొత్త శేఖరం, నాట్స్ బోర్డు వైస్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ బోర్డు డైరెక్టర్ శ్రీనివాస్ మల్లాది, నాట్స్ కార్యనిర్వాహక కమిటీ వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్/మార్కెటింగ్) భాను ధూళిపాళ్ల, ప్రోగ్రామ్ నేషనల్ కో ఆర్డినేటర్ రాజేష్ కాండ్రు, జాయింట్ ట్రెజరర్ సుధీర్ మిక్కిలినేని, సలహా కమిటీ సభ్యులు ప్రసాద్ ఆరికట్ల, సురేష్ బుజ్జా, చాప్టర్ కోఆర్డినేటర్ సుమంత్ రామినేని, జాయింట్ కో ఆర్డినేటర్ విజయ్ కట్ట, కోర్ టీమ్ కమిటీ అధ్యక్షులు నవీన్ మేడికొండ, హరి మండవ, భార్గవ్ మాధవరెడ్డి, భాస్కర్ సోమంచి, ప్రసాద్ కొసరాజు ఇతర క్రియాశీల వాలంటీర్లు ఈ కార్యశాల విజయవంతం చేయడానికి కృషి చేశారు. పిల్లల కోసం చేపట్టిన ఈ కార్యశాల కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ నాట్స్ చైర్‌పర్సన్ అరుణ గంటి, నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి(బాపు) నూతి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాట్స్ కార్యదర్శి రంజిత్ చాగంటి, కార్యనిర్వాహక మీడియా కార్యదర్శి మురళీకృష్ణ మేడిచెర్ల ఈ కార్యక్రమానికి తమ మద్దతు అందించారు.
అన్నమాచార్య కీర్తనలు కార్యశాల సభ్యుల వివరాలు..శిల్పా యడవల్లి, పూజా సజ్జ, సింధూజ వరిగినేని, శ్రీలలిత కట్ట, జ్యోతి కట్ల, ఎం.లక్ష్మీ సాహితీ, శ్రీనిధి యెంక, సుజిత్ జి, సుశాంత్ జి, జ్యోతి ఎం, రామ కామిశెట్టి, సౌజన్య వల్లంకొండ, సౌమ్య గోవిందు, శ్రావ్య పసుమర్తి, రాంబాబు వరిగినేని, రామారావు కొంపల్లి, జాహ్నవి కొంపెల్ల, హారిక బండి, సహస్ర తేజు గుబ్బా, ప్రతిమ యెంక, శ్లోక మక్తల