🕉️హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
✍🏻 18.08.2023 ✍🏻
🗓 నేటి రాశి ఫలాలు 🗓
🐐 మేషం
ఈరోజు (18-08-2023)
మిశ్రమకాలం. ఇబ్బంది పెడుతున్న సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. శ్రీవిష్ణువును ఆరాధించాలి.
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 వృషభం
ఈరోజు (18-08-2023)
బంధు,మిత్రులను సంప్రదించకుండా ఏ నిర్ణయం తీసుకోవద్దు. తొందరపాటుతో వ్యవహరించే సమస్యలు తప్పవు. శ్రమ లేకుండా చూసుకోవాలి. ధనవ్యయం సూచితం. నవగ్రహ ధ్యానశ్లోకాలు చదవండి.
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 మిధునం
ఈరోజు (18-08-2023)
ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. బుద్ధిబలం బాగుండటం వల్ల కొన్ని కీలక వ్యవహారాల నుంచి బయటపడగలుగుతున్నారు. నవగ్రహ నామస్మరణ శుభప్రదం.
💑💑💑💑💑💑💑
🦀 కర్కాటకం
ఈరోజు (18-08-2023)
ప్రారంభించబోయే పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇష్టమైన వారితో కాలం గడుపుతారు. కీలకమైన వ్యవహారాలు దైవబలంతో పూర్తవుతాయి. చంచల బుద్ధి వల్ల ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. గురు ఆరాధన శుభప్రదం.
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 సింహం
ఈరోజు (18-08-2023)
ప్రారంభించిన పనులలో సానుకూల ఫలితాలు లభిస్తున్నాయి. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తువులు కొంటారు. అధికారులు మీ అభివృద్దికి దోహదపడే ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంటారు. ఇష్టదైవారాధన మేలు చేస్తుంది.
🦁🦁🦁🦁🦁🦁
💃 కన్య
ఈరోజు (18-08-2023)
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. శ్రమ పెరుగుతుంది. ప్రణాళికాబద్దంగా వెళ్లకపోవడం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరించారు. నవగ్రహ ధ్యానం శుభప్రదం.
💃💃💃💃💃💃💃
⚖ తుల
ఈరోజు (18-08-2023)
ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. సమయానికి సహాయం చేసేవారు ఉన్నారు. కీలక వ్యవహారాల్లో మేలైన ఫలితాలు ఉంటాయి. శ్రీలక్ష్మీ ధ్యానం మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది.
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 వృశ్చికం
ఈరోజు (18-08-2023)
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. అనుకూలమైన సమయం. మీ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవారాధన మానవద్దు.
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 ధనుస్సు
ఈరోజు (18-08-2023)
ఉద్యోగంలో ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ఇష్టదైవ ప్రార్థన వల్ల మేలు జరుగుతుంది.
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 మకరం
ఈరోజు (18-08-2023)
ఒక వ్యవహారంలో మీకు పెద్దల నుంచి ఆశీస్సులు లభిస్తాయి. ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఒక వ్యవహారంలో మీ పనితీరును అధికారులు మెచ్చుకుంటారు. బంధువులతో అనుకూలత ఉంది. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలు పొందగలిగారు.
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 కుంభం
ఈరోజు (18-08-2023)
శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో డబ్బు మీ చేతికి అందుతుంది. చేపట్టే పనిలో విఘ్నం కలుగకుండా చూసుకోవాలి. భవిష్యత్ ప్రణాళికలు కొన్నింటిని అమలు చేస్తారు. తోటివారిని కలుపుకొనిపోవాలి. దుర్గాధ్యానం శుభప్రదం.
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 మీనం
ఈరోజు (18-08-2023)
ధనలాభం కలదు. వ్యాపారంలో ఆర్థికాభివృద్ధి అందుకుంటారు. విందు,వినోదాల్లో సంతోషంగా గడుపుతారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించే ముందు సాధ్యాసాధ్యాలను దృష్టిలో పెట్టుకోవాలి. దుర్గా ఆరాధన చేయాలి.
🦈🦈🦈🦈🦈🦈🦈