ఆస్టిన్ బ్రషీ క్రీక్ లేక్ పార్క్ లో శనివారం తానా-పాఠశాల 2023-24 సంవత్సరానికి అడ్మిషన్ కార్యక్రమంతో పాటు పుస్తకాల పంపిణీ నిర్వహించారు. పాఠశాల విద్యార్థుల ప్రార్ధనతో కార్యక్రమం మొదలుపెట్టారు. స్థానిక పాఠశాల కోఆర్డినేటర్ రజని మారం స్వాగతం పలికారు. పాఠశాల చైర్మన్ నాగరాజు నలజుల మాట్లాడుతూ పాఠశాల అతి తక్కువ రుసుముతో అందిస్తున్న పలుకు, అడుగు, పరుగు, వెలుగు కోర్సుల గురించి వివరించారు. పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది శ్రీనివాస్ ఇరివెంటి, రామ్ శ్యామ్ భమిడిపాటి, వర్ధిక మద్దుకూరి, కీర్తి సుస్మిత బుద్ధ, లక్ష్మి పైడిలను అభినందించారు. తానా RVP సుమంత్ పుసులూరి, రామ్ మారం, చిరంజీవి,శ్రీధర్ పోలవరపు, బాలాజీ పర్వతనేని, బాలాజీ గుడి ,లెనిన్ యర్రం,మాధవ్,కిరణ్,మరియు కుమార్ పిచికల, డా. ప్రవీణ్ సంపత్, ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల పరిశ్రమ చైర్మన్ గోపాల్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆస్టిన్‌లో తానా పాఠశాల కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అధ్యక్షుడు నిరంజన్ పాఠశాల బృందాన్ని అభినందించారు.
ఆస్టిన్‌లో తానా పాఠశాల కార్యక్రమం
Related tags :