Devotional

తిరుమల మెట్లమార్గంలో తగ్గిన భక్తుల సందడి

తిరుమల మెట్లమార్గంలో తగ్గిన భక్తుల సందడి

తిరుపతి: తిరుమలకు నడక మార్గంలో వెళ్లే భక్తుల సంఖ్య తగ్గింది. చిన్నారులపై చిరుతల దాడుల కారణంగా 15 ఏళ్ల లోపు పిల్లలను మధ్యాహ్నం 2 గంటల తర్వాత నడకదారిలోకి అనుమతించడం లేదు. దీంతో చాలా మంది పిల్లలతో బస్సుల్లో వెళ్తున్నారు. నడక మార్గంలో ప్రతి రోజు 12 వేల నుంచి 24 వేల వరకు వెళ్లేవారు. బుధవారం అలిపిరి మార్గంలో 8,200 మంది మాత్రమే తిరుమలకు వెళ్లారు. గురువారమూ ఇదే పరిస్థితి కనిపించింది. నడక మార్గంలో సెక్యూరిటీ సిబ్బంది కర్రలు పట్టుకొని కనిపించారు.