అనిల్ సుంకర ట్వీట్ లో…. ”మా మధ్య విభేదాలు అనేది పూర్తిగా అవాస్తవం. చిరంజీవి నాకు పూర్తి మద్దతును ఇచ్చారు. అతను మామూలుగా అందరితో మంచి సంబంధాలను కొనసాగిస్తారు. నాకు చిరంజీవికి మంచి సంబంధాలు అయితే ఉన్నాయి. ఇలాంటి నకిలీ వార్తల సృష్టించడం కొంతమందికి వినోదంగా ఉండవచ్చు. కానీ అది అందులో ఉన్నవారికి సమస్యలను తీసుకొస్తుంది. ఈ పరిస్థితి గురించి ఆందోళన వ్యక్తం చేసిన పరిశ్రమలోని నా శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు. వారందరి ఆశీస్సులతో మళ్ళీ తిరిగి రావాలని కోరుకుంటున్నాను… అంటూ షాకింగ్ పోస్ట్ చేశారు.దీనితో చిరంజీవికి, అనిల్ సుంకరకు మధ్య విభేదాలు లేనట్టు స్పష్టమవుతుంది. చిరంజీవి రెమ్యూనిరేషన్ కోసం అనిల్ సుంకరను ఇబ్బంది పెట్టారంటూ వచ్చే వార్తలు అవాస్తవమని అర్థమవుతుంది. ఇప్పటికే అనిల్ సుంకరతో చిరంజీవి సినిమా చేస్తారంటూ ఇంతకు ముందు చెప్పుకొచ్చారు. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అనేది చూడాలి.