జన్యుపరమైన లోపాల కారణంగా మనుషుల్లో వింత శిశువులు, ఇతర జీవుల్లో వింత దూడలు, కూనలు జన్మించడం సర్వ సాధారణమే. 2021లో ఇరాక్‌లో ఓ బాలుడు మూడు పురుషాంగాలతో జన్మించాడు. అలాంటి శిశువు జన్మించడం ప్రపంచంలోనే తొలిసారి. ఈ ఏడాది ప్రారంభంలో రాజస్థాన్‌లో ఓ బాలుడు మూడు చేతులతో జన్మించాడు. జంతువుల్లో కూడా ఒంటి కన్ను, మూడు కాళ్లు, ఐదు కాళ్లు, రెండు తలలతో జన్మించిన సందర్భాలను చూశాం. కానీ తాజాగా ఓ ఆవు దూడ రెండు తలలు, ఆరు కాళ్లతో జన్మించింది.బీహార్ రాష్ట్రం జాముయ్ జిల్లా కొల్దిహ గ్రామంలో ఇటీవల ఈ వింత చోటుచేసుకుంది. కొల్దిహ గ్రామంలో ఓ రైతు ఇంట్లో రెండు తలలు, ఆరు కాళ్లతో వింత ఆవు దూడ జన్మించిందని తెలియగానే చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు అక్కడికి తరలివచ్చారు. దైవం అంటూ ఆ లేగ దూడకు పూజలు చేయడం మొదలుపెట్టారు. అయితే, మరుసటి రోజు ఉదయం 5 గంటలకే ఆ లేగ దూడ ప్రాణాలు కోల్పోయింది.