Fashion

ఫోన్‌ ఛార్జింగ్‌ పెట్టి దాని పక్కనే పడుకోవటం కూడా ప్రమాదమట?

ఛార్జింగ్‌ పెట్టి దాని పక్కనే పడుకోవటం కూడా ప్రమాదమట?

ఏ పని చేస్తున్నా చేతిలో ఫోన్‌ ఉండటం ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. తింటున్నా, నడుస్తున్నా ఆఖరికి పడుకునే సమయంలో కూడా చేతిలో మొబైల్‌ ఉంటుంది. చాలా మంది ఫోన్‌ లేకుండా నిమిషం కూడా ఉండలేరు. ఎలా అంటే మొబైల్‌ ఛార్జి కావటానికి కూడా సమయం ఇవ్వరు ఒక వైపు ఛార్జింగ్‌ అవుతుంటే మరో వైపు ఫోన్‌ వాడుతుంటారు. ఇలా చేయటం ప్రమాదకరమని ఇప్పటికే పలు సందర్భాల్లో రుజువైంది. తాజాగా ఇదే విషయాన్ని ఐఫోన్లు తయారు చేసే సంస్థ యాపిల్‌ హెచ్చరికలు జారీ చేసింది. ఛార్జింగ్‌ పెట్టి దాని పక్కనే పడుకోవటం కూడా చాలా ప్రమాదకరమని ఐఫోన్‌ తయారీ సంస్థ యాపిల్ తెలిపింది. ఇలా చేస్తే ఒకో సారి ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని వినియోగదారులకు సూచించింది.

‘ఛార్జర్‌, అడాప్టర్, ఫోన్‌పై పడుకోకండి. వీటిని దిండు, దుప్పట్ల వద్ద ఉంచకండి. ఎల్లప్పుడూ గాలి, వెలుతురు ఉండే ప్రదేశాల్లో ఫోన్‌ ఛార్జ్ చేయండి. అలాగే ఫోన్ ఛార్జ్‌ అవుతున్న సమయంలో మొబైల్‌ వాడటం చాలా ప్రమాదకరం’ అంటూ ఐఫోన్ సంస్థ హెచ్చరింది. ఫోన్‌ పేలటం, ఎలక్ట్రిక్ షాక్‌, ప్రమాదాలు, ఫోన్‌ పాడైపోవటం వంటి వాటినుంచి బయటపడాలంటే ఐఫోన్‌ యూజర్లు వీటిని పాటించాలని సూచించింది.ఇతర థర్డ్‌ పార్టీ ఛార్జర్ల సాయంతో ఐఫోన్‌కు ఛార్జింగ్‌ చేయటానికి వీలవుతుంది. దీంతో ఇతర వాటిని ఉపయోగించి ఛార్జింగ్‌ చేయటం చాలా ప్రమాదకరం. ఒక్కోసారి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది’ అని యాపిల్‌ తెలిపింది. అలాగే తేమ ఉన్న ప్రదేశాల్లో ఛార్జింగ్‌ పెట్టడం కూడా మంచిది కాదని, అలా చేస్తే ఎలక్ట్రిక్‌ షాక్‌ తగిలి ఫోన్‌ పాడైపోతుందని వెల్లడించింది. ఈ కీలక అంశాలను పాటించాలని ఐఫోన్‌ తన వినియోగదారులను అప్రమత్తంచేసింది.