అమెరికా అధ్యక్షుడి పదవి కోసం పోటీ పడుతున్న భారతీయ సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి వివేక్ రామస్వామి చాలా నమ్మకమైన నాయకుడంటూ ‘X’ సీఈవో ఎలాన్ మస్క్ తన అఫీషియల్ ఖాతాలో పోస్ట్ చేసారు.
త్వరలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో మొతం ముగ్గురు భారతీయులు రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ పడుతున్నారు. వారిలో వివేక్ రామస్వామి అందరి కంటే చిన్నవారు. ఆయన తోపాటు నిక్కీ హాలే, హిర్ష్ వర్ధన్ సింగ్ అనే మరో ఇద్దరు భారత సంతతి వారు కూడా రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్ధి రేసులో ఉన్నారు. అయితే వీరందరి కంటే మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిగా రేసులో ముందు వరసలో ఉన్నారు.ఎన్నికల నేపథ్యంలో వివేక్ రామస్వామి అత్యంత దూకుడుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎదో ఒక కార్యక్రమం ద్వారా ఆయన నిత్యం ప్రజల మధ్యే ఉంటున్నారు. వీలు చిక్కినప్పుడల్లా పలు న్యూస్ చానళ్లకు ఇంటర్వ్యూలిస్తూ తన అభ్యర్థిత్వాన్ని బలపరచుకుంటున్నారు. ఇదిలా ఉండగా టక్కర్ కార్ల్సన్ షోలో పాల్గొన్న వివేక్ ప్రపంచంలోని బడా వ్యాపారవేత్తలు చైనా వెంటపడటాన్ని గుర్తు చేస్తూ వారంతా తిరిగి అమెరికా వెంట నడిచేలా చేస్తానని అన్నారు.